సాంకేతిక విప్లవానికి పునాది క్వాంటమ్‌ టెక్నాలజీ | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విప్లవానికి పునాది క్వాంటమ్‌ టెక్నాలజీ

Mar 5 2026 7:43 AM | Updated on Mar 5 2026 7:43 AM

తిరుపతి సిటీ:క్వాంటమ్‌ టెక్నాలజీ భవిష్యత్తు సాంకేతి క విప్లవానికి పునాది వంటిదని ఎస్వీయూ వీసీ తాతా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మానవీయ మిషన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఎంటీటీసీ) సహకారంతో క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ కాన్సెప్ట్‌, ఛాలెంజెస్‌ అండ్‌ ఆపర్చునుటీస్‌ అనే అంశంపై ఆరు రోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌, క్వాంటమ్‌ సెన్సింగ్‌ వంటి రంగాల్లో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నా యని తెలిపారు. అధ్యాపకులు, పరిశోధకులు క్యాంటమ్‌ టెక్నాలజీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం అవసరమని చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు వర్సిటీలో జరిగే ఈ ప్రొగ్రామ్‌కు దేశంలోని పలు వర్సిటీల నుంచి అధ్యాపకులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో కోర్డినేటర్‌ డాక్టర్‌ హేమలత, ఎంటీటీసీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయలక్ష్మి, ప్రొఫెసర్‌ హుస్సేన్‌, ప్రొఫెసర్‌ వాసుదేవరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement