శ్రీవారి దర్శనానికి 24 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Jan 3 2026 8:03 AM | Updated on Jan 3 2026 8:03 AM

శ్రీవ

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 65,225 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,106 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

10 నుంచి సంక్రాంతి సెలవులు

తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ తిరిగి పాఠశాలలు యథావిధిగా ప్రారంభం అవుతాయన్నారు. అన్ని పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షల విరాళం

తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణ దాన ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీబాలాజీ ఆరో గ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.10 లక్షల చొ ప్పున శుక్రవారం విరాళం అందింది. హైద రాబాద్‌కు చెందిన రైడాన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ వంగల హర్షవర్ధన్‌ రూ.10లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు, గ్లోబల్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీమతి నేలబొట్ల శుభ సౌజన్య శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.10లక్షల డీడీలను అందజేశారు. మొత్తం రూ.20 లక్షల డీడీలను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి శుక్రవారం ఆ సంస్థల ప్రతినిధుల తరుఫున తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్‌ సాధన సమితి కన్వీనర్‌ కుప్పాల గిరిధర్‌ కుమార్‌ అందజేశారు.

మైక్రోబయాలజీ విభాగానికి నిధులు మంజూరు

తిరుపతి తుడా: ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌న్‌భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ పథకం (పీఎంఏజీహెచ్‌ఐఎం) కింద స్విమ్స్‌ మైక్రోబయాలజీ విభాగానికి కేంద్రం ఇండియా్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ద్వారా ఐఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ నిమిత్తం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంజూరైన నిధులపై శుక్రవారం స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ వెంకటరమణ మాట్లాడుతూ ఇండియాన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఆరోగ్య పరిశోధన విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ద్వారా స్విమ్స్‌ మైక్రోబయాలజీ విభాగానికి పరిశోధన పథకానికి 2026వ సంవత్సరానికి గాను రూ.8,55,622,170 నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జయప్రద, రామకృష్ణ పాల్గొన్నారు.

పాలిటెక్నిక్‌ అర్హత పరీక్షకు ఉచిత శిక్షణ

తిరుపతి సిటీ: ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సులో డైరెక్టర్‌గా రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే అర్హత పరీక్షకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్‌ పి గణేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతోపాటు ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో ఈనెల 5వ తేదీలోపు పద్మావతిపురంలోని ఐటీఐ కళాశాలల్లో హాజరు కావాలన్నారు. ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రత్యేక ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 85000 21856, 95738 60659 నంబర్లలో సంప్రదించాలన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు 
1
1/1

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement