వెదురుపట్టుకు దక్కని ప్రాధాన్యం
దొరవారిసత్రం: సూళ్లూరుపేట కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పక్షుల (ఫ్లెమింగో ఫెస్టివల్) పండుగకు నేలపట్టు, పులికాట్ ప్రాంతాలకు ఇచ్చిన ప్రాధాన్యం వెదురుపట్టు పక్షుల కేంద్రానికి ఇవ్వలేదు. ప్రతిసారీ ప్రజాప్రతినిధుల నుంచి జిల్లాధికారుల వరకు వెదురుపట్టులో పక్షుల ఉన్న విషయం గుర్తించకపోవడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. వెదురుపట్టు ప్రాంతం ఎర్రకాళ్లకొంగ(పెయిడెండ్‌స్టార్క్)లకు సంతానోత్పత్తి కేంద్రంగా పేరుగాంచింది. ఈ ప్రాంతాన్ని కూడా వన్యప్రాణి విభాగం అధికారులు 1972లోనే సంరక్షణ కేంద్రంగా గుర్తించి సిబ్బందిని సైతం నియమించారు.అయినా ఫారెస్ట్ సిబ్బంది ఇక్కడకు రారు. ఈపక్షుల కేంద్రానికి వెళ్లాంటే వాహనాల్లో ఎన్‌ఎం అగ్రహారం గ్రామం సమీపంలోని జాతీయ రహదారి నుంచి సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లితే ఎర్రకాళ్లకొంగలను వీక్షించవచ్చు. ఈ పక్షుల పండుగకై న వెదురుపట్టు పక్షుల కేంద్రం గురించి పట్టించుకుంటారో?లేదో? వేచి చూడాలి మరి.


