తనియాలి ఎఫ్‌ఏ సస్పెన్షన్‌కు పీడీ ఆదేశం
దొరవారిసత్రం: తనియాలి ఎఫ్‌ఏ సస్పెండ్ చేయాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ ఆదేశించారు. డీవీ సత్రం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన సామాజిక తనిఖీలో ఎఫ్‌ఏలు, మేట్ల అవకతవకలు బట్టబయలయ్యాయి. మస్టర్లు వేసే ఎఫ్‌ఏలు చివరికి గ్రామాల్లో విధులు నిర్వహించే వీఆర్‌ఏ, వివిధ కంపెనీల్లో విధులు నిర్వ హించే కార్మికులు, ప్రైవేటు బ్యాంక్‌లోని బ్యాంకు మిత్రలకు సైతం మస్టర్లు వేసి నిధుల దోపి డీకి పాల్పడినట్లు తనిఖీల్లో తేలింది. తనియాలి పంచాయతీ ఎఫ్‌ఏ సుబ్బమ్మ బ్యాంక్ మిత్ర, అంగన్‌వాడీ ఆయా, కార్మికుల పేరుతో మస్టర్లు వేసి రూ.వేలు దుర్వినియోగం చేసినట్లు తేల డంతో దీనిపై స్పందించిన డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ సంబంధిత ఎఫ్‌ఏను సస్పెండ్ చేసేందుకు ఆదేశించారు.కార్యక్రమంలో ఏపీడీ ప్రేమ్‌కుమార్, ఎంపీడీఓ గోవర్ధన, ఏపీఓలు ఉషారాణి, భాస్కరయ్య, వైస్ ఎంపీపీ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లాలో 10కి తగ్గిన
ఆర్టీసీ డిపోలు
తిరుపతి అర్బన్: జిల్లాల పునర్విభజనలో భాగంగా 11 ఆర్టీసీ డిపోలు 10కి తగ్గనున్నా యని అధికారులు చెబుతున్నారు. గూడూరు మండలాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జి ల్లాలో కలిపిన నేపథ్యంలో గూడూరు ఆర్టీసీ డి పో నెల్లూరుకు వెళ్లనుంది. రైల్వేకోడూరు తిరుపతి జిల్లాలో కలిపినప్పటికీ ఆ ప్రాంతంలో ఆర్టీసీ డిపోలో లేని విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న 11 ఆర్టీసీ డిపోల్లో ఒక డిపో తగ్గుతుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
‘నూతన’వేళ కిక్కేకిక్కు
తిరుపతి క్రైమ్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీల్లో మద్యం షాపుల పనివేళలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీన మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చు. ఈ వేళల సడలింపు పూర్తిగా ఎకై ్సజ్ నిబంధనలు ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారమే చేపడతాయని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర్ రెడ్డి తెలిపారు.
శేషవాహనంపై
శ్రీకాళహస్తీశ్వరుని పురవిహారం
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి మంగళవారం శేష, యాలివాహనాల్లో పురవిహారం చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు పలు అభిషే క పూజలు చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని శేషవాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని యాలివాహనం కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు.


