తుమ్మలగుంటకు రండి..!
తిరుమల వెళ్లలేని భక్తులు..
తిరుపతి రూరల్: ‘వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వెళుతుంటారు.. అక్కడికి వెళ్ల లేని వారు తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోండి.. ఇక్కడ అత్యద్భుతంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారంలో ప్రవేశించి పునీతులు కండి.’ అని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చేసిన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడారు. భక్తుల రాక కోసం ఆలయ సమీపంలో సప్తద్వారాలు ఎదురు చూస్తున్నాయని, ఆల యం లోపల వైకుంఠ ద్వారం విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. దేశ, విదేశాల నుంచి తీసుకువచ్చిన పుష్పాలతో ఎంతో అందంగా అలంకరణ చేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో భక్తులను అలరించనున్నారని, నిత్యం గోవింద నామ స్మరణలతో భక్తులను కటాక్షించేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్‌తో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆలయ నిర్మించినప్పటి నుంచి ఏటా జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లలో గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేమన్నారు.
లక్ష మంది భక్తులు వస్తారని అంచనా
వైకుంఠ ఏకాదశి రోజున ఏటా 60 వేల నుంచి 75 వేల వరకు భక్తులు వచ్చేవారని ఈ సారి తిరుమలలో టోకెన్ల రద్దు కారణంగా మరో 25 వేల వరకు భక్తుల సంఖ్య పెరుగుతుందన్న అంచనాతో ఏర్పాట్లు చేశామని మోహిత్ రెడ్డి చెప్పారు. అందుకు తగ్గట్టుగానే భద్రత పరంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు 60 మంది పోలీసులను ఒకరోజు ముందుగా పంపించారని, భద్రత కల్పించేందుకు వచ్చిన పోలీసు అధికారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితో వైకుంఠ ఏకాదశి విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు జయచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, తంబిరెడ్డి, ఆర్సీపురం మండలానికి చెందిన ఎద్దుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
18 ఏళ్లుగా చెవిరెడ్డి చేతులు మీదుగానే..
18 ఏళ్లుగా వైకుంఠ ఏకాదశి వేడుకలు తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతులు మీదుగా జరిగినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వ రాజకీయ కుట్రలతో అక్రమంగా జైలులో నిర్భందించారని ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే తన తండ్రి చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఆలయం వద్ద చేసే ఏర్పాట్లలో ఎక్క డా లోపం లేకుండా పనులన్నీ పూర్తి చేశామన్నా రు. కుల, మత, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ తుమ్మలగుంట ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార ప్రవేశం చేయాలని విజ్ఞప్తి చేశారు.


