ఆగని గజదాడులు
చంద్రగిరి: అటవీ సమీప గ్రామాల్లో గజదాడులు ఆగడం లేదు. తాజాగా సోమవారం తెల్లవారుజామున మండల పరిధిలోని ఏ.రంగంపేట సమీపంలో ఏనుగుల గుంపు చొరబడి పంటలను ధ్వంసం చేసింది. గ్రామస్తుల కథనం మేరకు, శేషాచలం అటవీ ప్రాంతం నుంచి సుమారు ఏనుగుల గుంపు నాగపట్ల బీట్ పరిధిలోని ఏ.రంగంపేట సమీపంలో పంట పొలాల్లో చొరబడి నాశనం చేశాయి. పశుగ్రాసం, ఫెన్సింగ్, టేకు చెట్లను ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏనుగుల ఘీంకారాలతో అప్రమత్తమైన రైతులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు, గ్రామస్తుల సాయంతో ఏనుగులను దారి మళ్లించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
ఏనుగుల దాడిలో ధ్వంసమైన వరిపంటను చూపుతున్న రైతు , గజరాజులు ధ్వంసం చేసిన ఫెన్సింగ్
ఆగని గజదాడులు


