ఉపాధ్యాయుడి హఠాన్మరణం
భాకరాపేట: బైక్‌పై వెళుతూ ఉపాధ్యాయుడు హఠాన్మరణం పొందిన సంఘటన సోమవారం మండలంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు, పాకాల మండలం మొగరాల పంచాయతీ పరిధిలోని గరికినట్టు గ్రామానికి చెందిన డి.శ్రీనివాసులు (55) ఎరవ్రారిపాళెం మండలం పచ్చారావాండ్ల పల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతూ చిన్నగొట్టిగల్లు మండలం నెల్లుట్లవారి పల్లి పంచాయతీ వైక్రాస్ దగ్గర కిందపడి మృతి చెందారు. ఈయనకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈయన మృతికి కారణాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తాయని పోలీసులు వివరించారు.
ఆటలాడుకుంటూ అనంతలోకాలకు..
– బంతి కోసం వెళ్లి చిన్నారి మృతి
సైదాపురం: ఆటలాడుకుంటూ బంతి కోసం రోడ్డు దాటుతున్న సమయంలో టిప్పర్ కిందపడి, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి దుర్మర ణం చెందాడు. ఈ విషాదకర ఘటన సైదాపురంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దొర వారిసత్రం గ్రామానికి చెందిన పీ ఆదినారాయణ, సుష్మ దంపతుల కుమారుడు దక్షేష్(5) సైదాపురంలో ఎస్టీ కాలనీలో కాపురం ఉంటున్న తన అమ్మమ్మ కే పద్మమ్మ వద్ద ఉండేవాడు. సోమవారం ఉదయం దక్షేష్ బ్యాట్ బాల్‌తో ఆటలాడుకుంటున్నాడు. బాల్ వీధుల్లోంచి రోడ్డుపైకి చేరింది. ఆ బాల్ కోసం రోడ్డుపైకి వెళ్లాడు. రాపూరు మండలం పులిగిలపాడులోని మెటల్ క్రషర్ నుంచి ఓ టిప్పర్ కంకరతో గూడూరుకు వేగం వస్తూ ఓ దుకాణంలోకి దూకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న దక్షేష్ టిప్పర్ కిందపడి, గాయపడ్డాడు. ఆ బాలుడి అమ్మమ్మ స్థానికుల సాయంతో గూడూ రు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ దక్షేష్ మృతి చెందాడు. ఈ మేరకు కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
ఉపాధ్యాయుడి హఠాన్మరణం
ఉపాధ్యాయుడి హఠాన్మరణం


