పరిశోధనల్లో మెలకువలు అవసరం
తిరుపతి రూరల్ : యూనివర్సిటీలో జరిగే పరిశోధనా రచనల్లో మెలకువలు ఎంతో అవసరమని యూఎస్‌ఏలోని విస్‌కాన్సిన్ యూనివర్సిటీ రిసో ర్స్ పర్సన్ ఏంజెలా సూసన్ బకులా సూచించా రు. శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంగ్లీష్ విభాగం తరపున సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై రెండు రోజుల వర్క్‌షాప్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌నకు ముఖ్యఅతిథిగా అమెరికా నుంచి వచ్చిన ఆమె మాట్లాడుతూ పీహెచ్‌డీ విద్యార్థులు పరిశోధనా పత్రాన్ని రాయడంలో నియమాలు పాటించాల న్నారు. కన్వీనర్ ప్రొఫెసర్ పి. హరిపద్మ రాణి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల తో పరిశోధక ప త్రాలను తయారు చేయడానికి ఇలాంటి వర్క్‌షాప్ ఉపయోగమన్నారు. ఫార్మసీ, హోమ్‌సైన్స్, బయో సైన్సెస్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, ఉమెన్స్ స్టడీస్, కమ్యూనికేషన్ జర్నలిజం విభాగాల పరిశోధకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


