అర్హత ఉన్నా... తొలగించారు!
తిరుపతి సిటీ: బెంగళూరు వేదికగా ఈనెల 25వ తేదీ నుంచి జరగనున్న సౌత్‌జోన్ టెన్నిస్ క్రీడలకు తాను అర్హత సాధించినా అధికారులు తనను ఎంపిక చేయకపోవడం దారుణమని ఎస్వీయూ విద్యార్థిని గీత ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్ ఫిట్‌నెస్ కరెక్ట్‌గా ఉన్నా అధికారులు తనను ఎంపిక చేయకపోవడం దారుణమన్నారు. ఎంఏ ఎకనామిక్స్ రెండో సంవత్సరం చదువుతున్న తాను పలుసార్లు టెన్నిస్‌లో సత్తా చాటానని తెలిపారు. అధికారులు నిర్వహించిన పలు పరీక్షల్లో నెగ్గానని కాని అధికారులు పక్షపాత ధోరణి తో తనను ఎంపిక చేయకపోవడం బాధకలించే అంశమన్నారు.


