గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఐడీఈపై బూట్
తిరుపతి రూరల్: మండలంలోని సి.గొల్లపల్లిలో ఉన్న సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంటర్ ప్రినర్ షిప్ (ఐడీఈఇ)పై మూడు రోజుల బూట్ క్యాంప్‌ను సోమవారం ప్రా రంభించారు. ఈ క్యాంపునకు తిరుపతి, చిత్తూ రు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన పీఎం శ్రీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, ఉపాధ్యా యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేష న్ హబ్ సీఈఓ విజయ్ మాథూర్ మాట్లాడుతూ పీఎంశ్రీ స్కూళ్లలో సాంకేతికతను మెరుగుపరచ డానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగమన్నారు. అలాగే ఏఐసీటీఈ నోడల్ సెంటర్ హెడ్ యోగేష్ వదవన్, సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజశేఖర్ డాక్టర్ సాధిష్ ప్రభు, డాక్టర్ నాగేంద్ర యామల ప్రసంగించారు. ఈ శిక్షణ తరగతులకు 170 మంది ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు హాజరుకాగా వారందరికీ కళాశాల చైర్మన్ వై.కొండారెడ్డి, వైస్ చైర్మన్ వై.ఆనందరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీఓసీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి.నారాయణబాబు పాల్గొన్నారు.


