పరిశోధన, వ్యవసాయ రంగంలో అంతరాలను తగ్గించాలి
తిరుపతి రూరల్: పరిశోధన, బోధన, వ్యవసాయ రంగాల మధ్య అంతరాలను తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని ప్రభుత్వ సెరికల్చర్, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ బయోసైన్సెస్ అండ్ సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో ‘స్థిరమైన సెరికల్చర్ కోసం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అలాగే పెస్ట్ రెసిస్టెన్స్, కై ్లమేట్ రెసిలియన్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఉమ మాట్లాడుతూ నేటి సమాజంలో ఏఐ, నానో టెక్నాలజీలు కీలకంగా మారాయని పేర్కొన్నారు. యూహెచ్‌ఎస్ బాగల్‌కోట్ మాజీ డైరెక్టర్ ఎస్‌బి దండిన్, సెరికల్చర్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్. విజయకుమారి, బెంగళూరు నుంచి వచ్చిన సెంట్రల్ సిల్క్‌బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.మంతిరమూర్తి , మహిళా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. రజని మాట్లాడారు. ఉత్తమ సెరికల్చర్ రైతులకు డాక్టర్ ఎస్‌బీ దండిన్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.


