యూటీఎఫ్ తిరుపతి జిల్లా కమిటీ ఏకగ్రీవం
తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) తిరుపతి జిల్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌ఎస్ నాయు డు, ఎన్నికల అధికారి నవకోటేశ్వరరావు సోమవా రం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా జీజే రాజశేఖర్(దొరవారి సత్రం), ప్రధాన కార్యదర్శిగా కె ముత్యాలరెడ్డి(రేణిగుంట), గౌరవాధ్యక్షుడిగా డి రామచంద్ర య్య, సహా అధ్యక్షులుగా కుమారస్వామి, గీతమ్మ, కోశాధికారిగా మోహన్ బాబు ఎన్నికయ్యారన్నారు. అలాగే జిల్లా కార్యదర్శులుగా బండి మధుసూదన్ రెడ్డి, శేఖర్, ప్రభాకర్ మస్తానయ్య, సుధీర్, సురేష్, వెంకటకృష్ణ, పద్మజ, ఆదినారాయణ, గోవర్ధన రెడ్డి, హేమాంబధర రావు, విజయశ్రీ , మోహన్ రెడ్డి, శివప్రసాద్ , రాష్ట్ర కౌన్సిలర్లుగా దేవరాల నిర్మల, పత్తిపాటి రమేష్ నాయుడు, వాసుదేవరావు, నాగరాజు, కోటేశ్వరరావు, దాసరి మునెయ్య, వయ్యాల మధు, ప్రభావతి, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా నేలపల్లి మోహన్ ఎన్నికయ్యారని చెప్పారు. సభ్యులుగా శివకుమార్, చంద్రశేఖర్, నాగేశ్వరరావు, దీపిక, రవికుమార్, సురేష్, గురువారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా సూర్యప్రకాష్, శ్రీనివాసులు, రామమూర్తి రాజు, రామమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు ప్రకటించారు.


