ఏపీఎస్పీడీసీఎల్‌లో కారుణ్య నియామకాలు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో కారుణ్య నియామకాల కింద 50 మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేటర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో కారుణ్య నియామకాల కింద 250 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు కే.గురవయ్య, పి.అయూబ్ ఖాన్, కె.రామమోహన్‌రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె రమణాదేవి, ఎన్.శోభా వాలెంటీనా, పీహెచ్ జానకీరామ్, కె. ఆదిశేషయ్య, పి.సురేంద్ర నాయుడు, ఆర్డీఓ రామ్మోహన్, తిరుపతి ఎస్‌ఈ వి.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పాకాల మండలం కృష్ణాపురంలో కరెంటోళ్ల జనబాటను మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతులు మీదుగా ప్రారంభించారు. ఆ తరువాత మొగరాల సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు.


