పెద్దిరెడ్డి, భూమన, గురుమూర్తి పర్యటన నేడు
వరదయ్యపాళెం: వైఎస్సార్‌సీపీ కీలక నేతలు బుధవారం సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, వరదయ్యపాళెం మండలాల్లో పర్యటించనున్నట్లు ఆ పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తెలిపా రు. వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, మా జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఉదయం 9 గంటలకు కేవీబీపురం మండలంలో ఇటీవల ముంపునకు గురైన కళత్తూరు గ్రామాన్ని సందర్శించి, అక్కడ బాధిత ప్రజ లతో మమేకమై నష్టాన్ని తెలుసుకోనున్నారు. అలాగే వరదయ్యపాళెం మండలం కంచరపాళెంలో పార్టీ సీనియర్ నాయకుడు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బందిల బాల య్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్ని అక్కడ ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు రాజేష్ తెలిపారు.
పద్మావతికి శ్రీవారి సారె
తిరుమల: పద్మావతి అమ్మవారికి శ్రీవారి ఆల యం నుంచి సారెను సమర్పించారు. ఇందుకోసం ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుంచి 4.30 గంటల వరకు పరిమళాన్ని(నామకోపు, చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించా రు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేశారు. ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్ర సాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూ డిన సారెను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తిరుచానూరు పద్మా వతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు.
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఉ చిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వాసులై ఉండి డిగ్రీ పూర్తి చేసిన ఎస్టీ కులానికి చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ఫొటో, విద్య, కులము, ఆదాయ ధ్రువీకరణ ప త్రం, ఆధార్, పాన్ కార్డ్ తదితర జెరాక్స్ కాపీలను జతపరిచి ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నవారికి ఈ నెల 30న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ఎంపికై న అభ్యర్థులకు డిసెంబరు 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
లైఫ్ సర్టిఫికెట్ ఫిబ్రవరి లోపు ఇవ్వండి
తిరుపతి అర్బన్ : జిల్లాలోని పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను 2026 ఫిబ్రవరి 28వ తేదీలోపు అందజేయాలని జిల్లా ఖజానా లెక్కల అధికారి లక్ష్మీకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.గతంలో సర్టిఫికెట్‌ను నవంబర్, డిసెంబర్‌లో తీసుకునే వాళ్లమని చెప్పారు. అయితే దాన్ని ప్రస్తుతం జ నవరి, ఫిబ్రవరికి మార్పు చేశామన్నారు. జి ల్లాలోని 17,426 మంది పెన్షనర్లు సౌకర్యం కో సం తిరుపతిలోని ఉప ఖజానా కార్యాలయంలో రెండు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పా రు. అలాగే శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూళ్లురుపేట, పాకాల, చంద్రగిరి, పుత్తూరు, సత్యవేడు, తొట్టంబేడు, నాయుడుపేట, వాకాడు, గూడూ రు సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోనూ సర్టిఫికెట్లను అందజేయవచ్చన్నారు.
వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి– సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రె స్‌కు శాశ్వత అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసిన ట్లు తిరుపతి స్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి తెలిపా రు. సికింద్రాబాదు–తిరుపతి (20701), తిరుపతి –సికింద్రాబాదు (20702) నంబర్లు కలిగిన ఈ రై ళ్లకు ఇప్పటికే ఏసీ చైర్‌కార్‌లు 14 ఉండగా ఆ సంఖ్యను 18కి పెంచారన్నారు. కాగా ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ఎప్పటిలాగానే 2 కోచ్‌లతో నడుస్తుందన్నా రు. అయితే పెంచిన కోచ్‌లు బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
పెద్దిరెడ్డి, భూమన, గురుమూర్తి పర్యటన నేడు


