27న సింగపూర్ పర్యటనకు ముగ్గురు టీచర్లు
ఏర్పేడు: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకున్న ముగ్గురు ఉపాధ్యాయులు ఈనెల 27 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్‌లో అమలవుతున్న విద్యావ్యవస్థను పరిశీలించి, అక్కడ విద్యావిధానాన్ని అధ్యయనం చేసి, రాష్ట్రంలో కూడా ఉపయుక్తమయ్యే సంస్కరణలను తీసుకొచ్చి, మన విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం వీరిని సింగపూర్ పంపుతోంది. శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు జెడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ ఎన్.సుబ్రమణ్యశర్మ, తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్ స్కూల్ ఎస్‌జీటీ కయ్యూరు బాలసుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మండలం ఎగువ వీధి జెడ్పీ హైస్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎస్.రామకృష్ణ సింగపూర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈనెల 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు వీరు అక్కడ పర్యటించి అక్కడ విద్యావిధానాలపై అధ్యయనం చేయనున్నారు. అక్కడ పాఠశాలల్లో అత్యాధునిక బోధనా విధానాలు, తరగతి గది వాతావరణం, బోధనాభ్యసన ప్రక్రియ, టెక్నాలజీ ఆధారిత బోధనా విధానాలు, బోధనేతర పద్ధతులు, కరికులం, తరగతి గదుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల బోధన, అభ్యసనానుభవాలు తదితర పలు అంశాలను పరిశీలించనున్నారు. అక్కడ పర్యటన అనంతరం వారు అక్కడ గమనించి, ఇక్కడ అమలు చేయదలచిన విద్యా సంబంధిత విధానాలపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. వీరి నివేదికల ఆధారంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పుల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
కయ్యూరు సుబ్రమణ్యం
సుబ్రమణ్య శర్మ
రామకృష్ణ
27న సింగపూర్ పర్యటనకు ముగ్గురు టీచర్లు
27న సింగపూర్ పర్యటనకు ముగ్గురు టీచర్లు


