వేద సంగోష్టిలో ఎస్‌ఎస్‌యూ వీసీ
తిరుపతి సిటీ: ఢిల్లీలోని శ్రీలాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత వర్సిటీలో మంగళవారం నిర్వహించిన వేద సంగోష్టి కార్యక్రమానికి ఎన్‌ఎస్‌యూ వీసీ ప్రొఫెసర్ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి హాజరయ్యారు. శ్రీశృంగేరి శారదా పీఠం, జగద్గురు శంకరాచార్య మూల మహాసంస్థానం కనిష్ట పీఠాధిపతులు విధుశేఖర భారతి మహాస్వామీజీ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. శాస్త్ర పరిరక్షణ, సనాతన ధర్మ సంరక్షణ జగద్గురు శ్రీ శృంగేరి శారదా పీఠం ద్వారా జరుగుతుందని, జగద్గురు శంకరాచార్యుల మహాస్థాన కనిష్ట పీఠాధిపతులు పూజ్యస్వామీజీనీ ప్రత్యక్షంగా స్వాగతించడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని తెలిపారు.


