స్వార్థం అనే గునపాన్ని స్వర్ణముఖి మదిలో దించుతున్నారు.
రుద్రవరం టూ చైన్నె
అడుగంటుతున్న భూగర్భ జలాలు
అనుమతులు లేని చోట్ల అక్రమ తవ్వకాలు
కనీసం తనిఖీలు కూడా చేయని గనులశాఖ
రుద్రవరం వద్ద స్వర్ణముఖిలో తవ్వకాలు చేస్తున్న జేసీబీలు
సాక్షి టాస్క్‌పోర్సు: చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తరువాత గూడూరు నియోజకవర్గంలో ప్రకృతి సంపదపై కన్నెసిన బడా బాబులు దాన్ని కొల్లగొడుతున్నారు. దీంతో ప్రధాన వనరులైన సిలికా, ఇసుక, గ్రావెల్, తెల్లరాయి ఎక్కడ ఉందో అక్కడ అక్రమ తవ్వకాలు జరిపి జేబులు నింపుకునేందుకు సిద్ధం అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు తమ సొంతానికి ప్రకృతి సంపదను తీసుకుని వెళదామంటే ప్రధాన రహదారులతో పాటు మారుమూల ప్రాంతాల్లోని రోడ్లపై చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వారిని కట్టడి చేసి వారి వద్ద నుంచి భారీగా వసూలు చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. ఈ క్రమంలోనే గూడూరు నియోజకవర్గంలోని స్వర్ణముఖి నది వీరి ధనదాహం తీర్చేందుకు ప్రధాన వనరుగా మారింది. దీంతో స్థానికంగా ఇసుకను విక్రయించుకుంటే తక్కువ ఆదాయం వస్తుందని, దానిని బాగా పెంచుకునేందుకు స్వర్ణముఖి నుంచి నేరుగా చైన్నెకు రోజుకు కనీసం 50 టిప్పర్లకు తక్కువ లేకుండా తరలించి జేబులు నింపుకుంటున్నారు.
బ్యారేజ్‌లో నీరు నిల్వ ఉన్నా పరిస్థితి దారుణం
స్వర్ణముఖి నదిలో భారీ వర్షాలు కురిసిన సమయంలో గతంలో ఇసుక కూడా భారీగా వచ్చి చేరింది. దీంతో నదిలో ఇసుక బాగానే లభ్యమయ్యేది. అయితే నేడు ఇసుక డిమాండ్ బాగా ఉండడంతో నది పుట్టిన చిత్తూరు జిల్లా నుంచి సముద్రం గర్భంలో కలిసే వరకు ఇసుకాసురులు ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేపట్టడంతో ఎగువ నుంచి వచ్చే ఇసుక ఎగువ ప్రాంతంలో తవ్విన గుంతల్లోనే ఉండి పోతుంది. దీంతో దిగువ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టిన గుంతల్లోకి రావడం లేదు. దీంతో బ్యారేజ్‌కు గంగ నీటిని విడుదల చేసినప్పటికి నదీ పరివాహక ప్రాంతాల్లో బోర్లు వేసుకున్నా నీరు రావడం లేదు. అలాగే వేసవి కాలంలో పలు గ్రామాలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బ్యారేజ్‌లో నీటి నిల్వలున్నా పరిస్థితి దారుణంగా ఉంది.
రుద్రవరం టూ చెన్నె..
కోట మండలం రుద్రవరం గ్రామం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసుకున్న అనధికారిక రీచ్ నుంచి రోజు కనీసం 40 టిప్పర్లు ఇసుకను చైన్నెకు తరలించేస్తున్నారు. ఒక టిప్పర్‌కు కనీసం 40 టన్నులు ఇసుక రవాణా చేస్తుండగా చైన్నెకు చేర్చితే సుమారు రూ.1.30 లక్షలు పలుకుతోంది. దీంతో యథేచ్ఛగా ఇసుకను సరిహద్దులు దాటిచ్చేస్తున్నారు. భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడుతున్నాయి.
ఊనుగుంటపాళెం సమీపంలో చైన్నెకు తరలించేందుకు నిల్వ చేస్తున్న
ఇసుక గుట్టలు
రుద్రవరం వద్ద కరకట్టను
ధ్వంసం చేసి ఏర్పాటు చేసిన దారి
గూడూరు నియోజకవర్గంలో ఇలా..
గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో స్వర్ణముఖి నది ప్రవహించి అనంతరం సముద్రంలో కలుస్తుంది. మూడు మండలాల్లో చిట్టమూరు మండలంలో మెట్టు, కోట మండలంలో రుద్రవరం, గూడలి, దొరువు కట్ట, వాకాడు మండలంలో బాలిరెడ్డిపాళెం, గ్రామాల్లో ఇసుకను తవ్వుకునేందుకు వీలుగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉచిత ఇసుకను గూడలి నుంచి తరలించాల్సి ఉండగా మిగిలిన ప్రాంతాల్లో అనధికారికంగా ఇసుకను తవ్వి రోజూ చైన్నెకు తరలించేస్తున్నారు. ఉచిత ఇసుక అని చెబుతూనే ఒక ట్రాక్టర్ లోడ్ రూ.4.500 వరకు పలుకుతోంది. స్థానికంగా వినియోగించే ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుంటే చైన్నెకు వెళ్లే ఇసుకను టిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలపై గనుల శాఖ కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా నదిలో పలు ప్రాంతాల్లో 20 అడుగుల లోతుకు తవ్వకాలు చేపట్టడంతో మట్టి కనిపిస్తుందని దీంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
కరకట్టలు ధ్వంసం
చిట్టమూరు మండలంలోని అన్నమేడు గ్రామం నుంచి వాకాడు మండలంలోని పామంజి వద్ద సముద్ర గర్భం వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర స్వర్ణముఖి నది ప్రవహిస్తుండగా నదికిరువైపులా ప్రవాహం పొంగి ప్రవహిస్తుందని, గత 10 ఏళ్ల కిందట అధికారంలో ఉన్న నేటి ప్రభుత్వంలో తమ అనుచరులకు రూ.కోట్లతో కరకట్టల పనులు అప్పగించి, పనులు పూర్తి చేశారు. అప్పట్లో ఆ పనుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని విమర్శలు వ్యక్తం అయ్యాయి. నేడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌లో అదే కరకట్టలను తమ ఇష్టానికి అనుగుణంగా తొలగించి దారులు ఏర్పాటు చేసుకుని ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీంతో నదిలో ఇసుక మాయమై నేడు ఎక్కడ పడితే అక్కడ గడ్డి, తుంగ కనిపిస్తుంది.
స్వర్ణముఖిని
కొల్లగొడుతున్నారు!
స్వార్థం అనే గునపాన్ని స్వర్ణముఖి మదిలో దించుతున్నారు.
స్వార్థం అనే గునపాన్ని స్వర్ణముఖి మదిలో దించుతున్నారు.
స్వార్థం అనే గునపాన్ని స్వర్ణముఖి మదిలో దించుతున్నారు.
స్వార్థం అనే గునపాన్ని స్వర్ణముఖి మదిలో దించుతున్నారు.


