
రోడ్డెక్కిన వింగ్‌టెక్ కార్మికులు
చేతులెత్తేసిన వింగ్ టెక్, లెక్చర్ కంపెనీలు
250 మంది కార్మికుల భవితవ్యం అయోమయం
కార్మికులతో చర్చించిన ఆర్డీవో
భానుప్రకాష్ రెడ్డి
రేణిగుంట : రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఈఎంసీ–2 క్లస్టర్‌కు చెందిన వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్ కంపెనీకి చెందిన 250 మంది కార్మికులు బుధవారం సాయంత్రం కంపెనీ ప్రధాన ద్వారానికి ఎదురుగా బైఠాయించి నిరసన తెలిపారు. 2017–18లో స్థాపించిన కంపెనీలో 1000 మంది కంపెనీ ఉద్యోగులు కాగా, 1400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో 750 మంది పర్మినెంట్ ఉద్యోగులను తీసివేశారు. అలాగే 1400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. మిగిలిన 250 మంది పరిస్థితి ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఉన్నఫలంగా కంపెనీ యాజమాన్యం అందుబాటులో లేకుండా వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా అవాకై ్కన కార్మికులు ఇప్పుడొచ్చిన కొత్త కంపెనీ లెక్ షేర్ యాజమాన్యం మీరు మా ఉద్యోగులు కారని అంటున్నారని పలువురు కార్మికులు వాపోయారు. కార్మికులు చేస్తున్న నిరసనకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపి వారితో పాటు బైఠాయించారు. ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కార్మికులతో చర్చించారు. పూర్తి సమాచారాన్ని తెలుసుకొని కార్మికులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.