
గోకులాష్టమి ఆస్థానం
నారాయణవనం: స్థానిక పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో నిత్యపూజా కార్యక్రమాలు పూర్తి చేసి, దూప, దీప నైవేద్యాలను సమర్పించారు. సాయంత్రం ఆస్థాన మండపంలో బాలగోలుడిని పీఠంపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ బాలగోపాలుడికి ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్థాన మండపాన్ని నేతి దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్యులు మాట్లాడుతూ ఆదివారం ఆలయంలో గోకులాష్టమి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం శ్రీకృష్ణుడి మాడవీధి ఊరేగింపు, సాయంత్రం సన్నిధి వీధిలో ఊట్లోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.