
ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
తిరుపతి సిటీ : రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌లో 2026 విద్యా సంవత్సరానికి గాను 8వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాద్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో 7వ తేదీ డిసెంబర్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు 2వతేదీ జూలై 2013 నుంచి 01 జనవరి 2015 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు అని, ప్రవేశ పరీక్ష విధానం, దరఖాస్తులు వంటి సమాచారం కోసం 9399976999/ 8688888802/03 ఫోన్ నంబర్లలో గాని వరదరాజనగర్ లోని విశ్వం సైనిక్ అండ్ మిలిటరీ పోటీ పరీక్షల సమాచార కేంద్రంను సంప్రదించాలని సూచించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ యాదవ్
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన నల్లబోయిన గంగాధర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదల చేశారు.
తిరుమల ఘాట్‌లో ప్రమాదం
తిరుమల : తిరుమల డౌన్ ఘట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. స్కూటర్‌పై వస్తున్న ఇద్దరు మహిళల్లో, ఒకరికి ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి వాహనదారులు స్పందించి వారిని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. గాయపడిన మహిళ టీటిడీ ఉద్యోగి సతీమణిగా గుర్తించారు.
బంగారు కమ్మల మేళా
– తిరుపతి ఎగ్జిబిషన్ సేల్ నేటితో ముగింపు
తిరుపతి అర్బన్ : తిరుపతి నగరం రామానుజు సర్కిల్ సమీపంలోని ఏకాంత బ్లిస్‌లో శనివారం బంగారు కమ్మల మేళాను శ్రీకాళహస్తికి చెందిన మాధురీ గోల్డ్ షాపు వారు నిర్వహించారు. ఆదివారంతో ఈ మేళా కార్యక్రమాన్ని ముగించనున్నారు. బంగారు కమ్మల మేళాలో వందకుపైగా మోడల్స్‌ను ప్రదర్శించారు. అందర్నీ ఆకట్టుకునేలా మేళాలో వివిధ మోడల్స్‌ను చూపడంతో పలువురు ఆకర్షితులయ్యారు. ప్రతి గ్రామంపై 501 తగ్గింపు ప్రకటించడంతో ఆదరణ లభించిందని మాధురీ గోల్డ్ ప్రొపరైటర్ సునీల్‌కుమార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.