
మద్యం అక్రమ కేసులో వ్యక్తి అరెస్టు
శ్రీకాళహస్తి : అక్రమంగా మద్యం విక్రయిస్తున్న తులకనం హిమకిషోర్ (30)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ లావణ్య తెలిపారు. పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధికి చెందిన హిమకిషోర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే మార్గంలోని అయ్యలనాడు చెరువు కట్టపై అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ లావణ్య చెప్పారు.
పెట్రోల్ బంకులో తనిఖీలు
తిరుపతి క్రైమ్ : తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కరిముల్లా ఆదేశాల మేరకు శనివారం తిరుపతి నగరంలోని అక్కారంపల్లి సర్కిల్ సమీపంలోని వెంకటసాయి ఫిల్లింగ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. వారితో పాటు సివిల్ సప్లయి డీటీ గంగయ్య, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ ఉన్నారు. అయితే ఫిల్లింగ్ స్టేషన్‌లోని 7 పంపుల్లో రెండు నాజల్స్‌లో కొలతల అంశంలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ మేరకు రెండు నాజల్స్‌ను సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
డిస్టెన్స్‌లో ఆ కోర్సులకు
మంగళం!
తిరుపతి సిటీ : ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న దూరవిద్య, సార్వత్రిక విద్యా కేంద్రాలలో పలు కోర్సులకు ప్రవేశాలు చేపట్టరాదని యూజీసీ ఆదేశించినట్లు తెలుస్తోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో సిఫార్సుల మేరకు త్వరలో ఆయా వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే సంబంధిత కోర్సులపై నిషేధం విధించనుంది. ఇందులో ప్రధానంగా సైకాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ సైన్స్, బయో టెక్నాలజీ, క్లినికల్ న్యూట్రీషియన్ వంటి ఆరోగ్య సంరక్షణ కోర్సులను దూర విద్య ద్వారా అందించరాదని నిషేధం విధించనుంది.