స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తులు

Aug 13 2025 7:26 AM | Updated on Aug 13 2025 7:26 AM

స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తులు

స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తులు

తిరుపతి సిటీ: జిల్లాలో రెండేళ్ల కాలవ్యవధితో స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పోస్టు నియామకాలకు సంబంధించి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), పీఈటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10 ఏళ్ల సర్వీసు కలిగి అర్హులైన ఉపాధ్యాయులు ఈనెల 20వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 85 అర్జీలు

తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీ లు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 3 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,628 మంది స్వామివారిని దర్శించుకోగా 30,505 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

డీ–ఫార్మసీ కోర్సుకు

దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గానూ డీఫార్మసీ రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.ద్వారకనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్‌ బైపీసీ, ఎంపీసీ రెగ్యులర్‌ లేదా ఓపెన్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులన్నారు. విద్యార్థులు httpr://apsbtet.in/pharmacy వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రతిని తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని ఫార్మసీ విభాగంలో ఈనెల 19వ తేదీలోపు అందజేయాలని తెలిపారు. లేదా 9908857585, 9966761446, 9963541557, 9550690007,9059698747 నంబర్లకు వాట్సాప్‌ ద్వారా పంపవచ్చన్నారు.

నేటి నుంచి ఉచిత విద్యకు దరఖాస్తులు

తిరుపతి అర్బన్‌: ప్రైవేటు అండ్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద పిల్లలకు అందించాల్సిన 25 శాతం సీట్లకు సంబందించి ఉచిత విద్య కోసం మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి సురేష్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సచివాలయంలో లేదా డబ్యూడబ్యూడబ్యూ.సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అనంతరం ఈ నెల 25న ఎంపికై న విద్యార్థుల ఫలితాలను వెల్లడిస్తామని, 31 నుంచి పాఠశాలల్లో ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేశారు. హెల్ప్‌లైన్‌ కోసం 1800–4258599 నంబరుకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సంప్రదించవచ్చన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందని వెల్లడించారు. దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, అనాథలు, వీధి పిల్లలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు.

టాటా కేర్‌ ఫౌండేషన్‌తో

ఎంఓయూ

తిరుపతి తుడా: స్థానిక జూపార్క్‌ రోడ్డులోని ఎస్వీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్డ్‌స్‌ రీసెర్చ్‌ (స్వీకార్‌)లో సోమవారం టాటా కేర్‌ ఫౌండేషన్‌తో ఫెరడల్‌ బ్యాంక్‌ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా సంజీవినీ ప్రొగ్రాంలో భాగంగా క్యాన్సర్‌ డయాగ్నిస్టిక్‌ టెస్ట్‌లు, చికిత్స అవసరమైన అర్హులైన రోగులకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడమే ఎంఓయూ లక్ష్యమని బ్యాంక్‌ అధికారులు తెలిపారు. అలాగే అస్సాం రాష్ట్ర క్యాన్సర్‌ కేర్‌ ఫౌండేషన్‌తోనూ ఇదే అంశాలపై అవగాహన కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఫెడరల్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఎఫ్‌ఓ ఎం.వెంకట్రామన్‌, టాటా క్యాన్సర్‌ సీఎఫ్‌ఓ కుమార్‌ నందుల, అస్సాం క్యాన్సర్‌ కేర్‌ ఫౌండేషన్‌ సీఓఓ డాక్టర్‌ జైప్రకాష్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement