అడ్మిషన్లు.. | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లు..

Aug 11 2025 7:27 AM | Updated on Aug 11 2025 7:27 AM

అడ్మి

అడ్మిషన్లు..

మన బండ్లే .. వదిలేయండి!
కలువాయిలో రెవెన్యూ, పోలీసులు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నారు. కూటమి నేతల నుంచి ఫోన్లు రావడంతో వదిలేశారు.
బురిడీ కొట్టించిన మహిళలు అరెస్టు
బంగారం దుకాణంలో నగల కొనుగోలుకు వచ్చి బంగారు నగలు కాజేసిన మహిళలను పోలీసులు పట్టుకున్నారు.

సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లో

జిల్లా సమాచారం

ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు 2

ప్రైవేటు కళాశాలలు 11

అటానమస్‌ కళాశాలలు 5

డీమ్డ్‌ యూనివర్సిటీలు 2

అన్ని కళాశాలలో సీట్ల సంఖ్య 31,750

తొలి విడతలో సీట్లు పొందిన

విద్యార్థులు 12,218

రెండవ విడత కౌన్సెలింగ్‌కు

వెబ్‌ ఆప్షన్లు పెట్టిన వారు 21,475

‘శ్రీకాళహస్తికి చెందిన ఓ విద్యార్థిని ఏపీఈఏఎమ్‌సెట్‌–2025లో మంచి ర్యాంకు సాధించింది. గత నెలలో జరిగిన తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో చంద్రగిరి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సీఎస్‌ఈలో సీటు సాధించి అడ్మిషన్‌ పొందింది. కానీ రెండవ విడతలో మరో మెరుగైన కోర్సు కోసం వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకుంది. స్థానికత రిజర్వేషన్ల విషయంలో ప్రవేశాలపై హైకోర్టు స్టే విధించడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. కళాశాల యాజమాన్యం తరగతులకు హాజరు కావాలంటూ ఒత్తిడి చేస్తుండటం, మళ్లీ రీ కౌన్సెలింగ్‌ జరుగుతుందనే గందరగోళంలో సతమతమవుతున్నారు.’

రీ కౌన్సెలింగ్‌ భయం ఉంది

కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది. ఏ ఒక్క కోర్సులోనూ ప్రవేశాలు సక్రమంగా చేపట్టలేదు. సాంకేతిక విద్యామండలి అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. అనుభవరాహిత్యమా? లేక అధికార మదమో తెలియదు కానీ ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన తీరు దారుణంగా ఉంది. మా అబ్బాయికి ఎస్వీయూలో తొలి విడతలో ఈసీఈలో సీటు దక్కడంతో ప్రవేశం తీసుకున్నాం. కోర్టు స్టేతో పరి స్థితి అర్థం కావడం లేదు. తొలి విడత ఫలితాలను రద్దు చేసి మళ్లీ రీకౌన్సెలింగ్‌ నిర్వహిస్తారనే భయం ఉంది. – రత్నప్రభ, విద్యార్థి తల్లి, తిరుపతి

తరగతులకు హాజరు

కావాలా? వద్దా?

తొలి విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో మా అమ్మా యికి తిరుపతి శివారులోని ఓ ప్రముఖ కళాశాలలో సీఎస్‌ఈ ఏఐ బ్రాంచ్‌లో సీటు వచ్చింది. అడ్మిషన్‌ అయ్యాం. కానీ రెండవ విడత కౌన్సెలింగ్‌ పూర్తి కావస్తున్న సమయంలో స్థానికత రిజర్వేషన్ల సమస్యతో ప్రవేశాలపై కోర్టు స్టే విధించింది. స్థానికత సమస్య ఎప్పుడు పరి ష్కారమవుతుందో తెలియడంలేదు. కానీ కళాశాల నుంచి తరగతులకు హాజరు కావాలని ఫోన్‌లు, మెసేజ్‌లు వస్తున్నాయి. వెళ్లాలా? వద్దా ? అర్థం కాని పరిస్థితి నెలకొంది. – రామచంద్రయ్య,

విద్యార్థి తండ్రి, రేణిగుంట

ప్రవేశాలు గందరగోళంగా మారాయి

నేను ఏపీఈఏఎమ్‌సెట్‌ లో మంచి ర్యాంక్‌ సాధించా. జిల్లాలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈలో జాయిన్‌ అయ్యాను. అడ్మిషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తరగతులకు హాజరు కావాలని కళాశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. రీ కౌన్సెలింగ్‌ జరిగితే మళ్లీ నాకు ఆ కళాశాలలో సీటు వస్తుందా... అనే అనుమానం ఉంది.

– రవిశంకర్‌, విద్యార్థి, తిరుపతి

ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవితవ్యం అయోమయంగా మారింది. తొలి విడతలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇప్పటికే స్థానికతపై కోర్టుకు వెళ్లడంతో అడ్మిషన్ల ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. రిజర్వేషన్లు తేల్చకుండా ప్రవేశాలు నిర్వహించడంపై నిపుణులు మండిపడుతున్నారు. ఒకవైపు తరగతులకు హాజరు కావాలని కళాశాలలు ఒత్తిడి చేస్తున్నాయి..మరోవైపు న్యాయ స్థానం రీకౌన్సెలింగ్‌కు ఆదేశిస్తే పరిస్థితి ఏంటో ఊహించడం కష్టంగా మారింది. సాంకేతిక విద్యామండలి అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతోంది.

తిరుపతి సిటీ : ఏపీఈఏఎమ్‌సెట్‌–2025 కౌన్సెలింగ్‌ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల విషయంలో కోర్టు మెట్లు ఎక్కడంతో ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే తొలి విడత అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తొలి విడత కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులను తరగతులకు హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. మళ్లీ రీ కౌన్సెలింగ్‌కు న్యాయస్థానం ఆదేశిస్తే పరిస్థితి ఏమిటి...అంటూ ఆవేదన చెందుతున్నారు.

రిజర్వేషన్లు తేల్చకుండా ప్రవేశాలు ఎలా?

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాటి నుంచి ఏ ఒక్క వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలేదని నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని విమర్శిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియను అస్తవ్యవస్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లను తేల్చకుండా కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఎలా చేపడుతుందని ప్రశ్నిస్తున్నారు. అర్హతలేని వ్యక్తులు, కనీస పరిజ్ఞానం లేని వ్యక్తుల చేతుల్లోకి పాలన వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను చూస్తే అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడిందని ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్ని స్తున్నారు.

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఇంజినీరింగ్‌ ప్రవేశాలపై తొలగని సందిగ్ధం

ఆందోళనలో తొలి విడత ప్రవేశాలు

పొందిన విద్యార్థులు

కళాశాలకు హాజరు కావాలంటూ ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిళ్లు

రీకౌన్సెలింగ్‌ జరిగితే పరిస్థితి ఏమిటో అర్థం కాలేదంటున్న తల్లిదండ్రులు

కోర్టులో స్థానికత సమస్య తేలేదీ ఎప్పుడో అంటూ నిట్టూరుస్తున్న విద్యార్థులు

అధికారుల నిర్లక్ష్యం

ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర సాంకేతిక విద్యామండలి నిర్లక్ష్యం, అసమర్థతే. కూటమి ప్రభుత్వం వి ద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ తొలి విడత పూర్తి అయ్యేంత వరకు స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల విషయంపై అవగాహన లేకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనం. డిగ్రీ, పీజీ అడ్మిషన్లు ప్రక్రియపైనా అయోమయం నెలకొంది. – నారాయణరెడ్డి,

విశ్రాంత అధ్యాపకులు, తిరుపతి

మా పరిస్థితి వర్ణనాతీతం

గతంలో ఏటా క్రమం తప్పకుండా ఆగష్టులో ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు పూర్తి చేసి తరగతులు ప్రారంభించేవారు. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రవేశాలు నిలిచిపోవడంతో ఏపీఏఎమ్‌సెట్‌లో సాధారణ ర్యాంక్‌ వచ్చిన మా లాంటి వారి పరిస్థితి అర్థం కావడంలేదు. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు త్వరగా పేమెంట్‌ సీటులో ప్రవేశాలు పొందాలంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. కానీ రెండు, మూడవ విడతలలో ఫ్రీ సీటు వస్తుందనే ఆశతో ఉన్నాం. మా పరిస్థితి వర్ణనాతీతం.

– శ్రావణి ప్రియ, విద్యార్థిని, తిరుపతి

అడ్మిషన్లు నిలిచిపోవడంతో అర్థం కావడం లేదు..

మా అమ్మాయికి ఏపీఈఏఎమ్‌సెట్‌–2025లో ర్యాంక్‌ వచ్చింది. కానీ తొలి విడతలో సీటు రాలేదు. రెండవ విడత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియలో సీటు కోసం ఆప్షన్లు పెట్టుకున్నాం. పక్కా సీటు ప్రభుత్వ, డీమ్డ్‌ కళాశాలలో వస్తుందని ఆశించాం. కానీ అడ్మిషన్లు నిలిచిపోవడంతో ఏమి చేయాలో అర్థం కావడంలేదు. మళ్లీ రీ కౌన్సెలింగ్‌ చేపడితే సీటు వస్తుందని నమ్మకం లేదు. కానీ పేమెంట్‌ సీటు కోసం ఓ ప్రముఖ కళాశాలలో దరఖాస్తు చేశాం. కళాశాల యాజమాన్యం త్వరగా ప్రవేశం తీసుకోండి. సీట్లు ముగింపు స్థాయికి చేరుకున్నాయంటూ తొందర పెడుతున్నారు. – సరస్వతమ్మ, విద్యార్థి తల్లి, తిరుపతి

అడ్మిషన్లు..1
1/6

అడ్మిషన్లు..

అడ్మిషన్లు..2
2/6

అడ్మిషన్లు..

అడ్మిషన్లు..3
3/6

అడ్మిషన్లు..

అడ్మిషన్లు..4
4/6

అడ్మిషన్లు..

అడ్మిషన్లు..5
5/6

అడ్మిషన్లు..

అడ్మిషన్లు..6
6/6

అడ్మిషన్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement