
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తిలో జరుగుతున్న గ్రీవెన్స్‌కు హజరుకానున్నారు. దీంతో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ నేతృత్వంలో కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ చేపట్టనున్నారు.
ఐసీడీఎస్‌లో
ఉద్యోగానికి దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ వసంతబాయి ఒక ప్రకటనలో ఆదివారం వెల్ల డించారు. ఈనెల 11 నుంచి 20 వరకు దరఖాస్తు ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. పోస్టు ద్వారా లేదా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖా స్తు ఇవ్వాలని తెలిపారు. 25–42 వరకు వయో పరిమితి ఉండాలని, ఓసీ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే రూ.200 నగ దు దరఖాస్తుతో పాటు చెల్లించాలని స్పష్టం చేశా రు. అదనపు సమాచారం కోసం తిరుపతి.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
నేటితో ముగియనున్న
ఇంటర్ ప్రవేశాలు
తిరుపతి సిటీ:జిల్లాలోని ప్రభుత్వ,హైస్కూల్ ప్లస్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆయా కళాశాల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి సూచించారు.
21న రాగి రేకులకు
టెండర్ కమ్ వేలం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ సిల్వర్ కోటెడ్ రాగి రేకులు ఈ నెల 21వ తేదీన టెండర్ కమ్ వేలం (ఆఫ్‌లైనన్‌్ ) వేయనున్నారు. ఈ మేరకు ఆదివారం టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలం) 0877–2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో లేదా టీటీడీ వెబ్‌సైట్ ను సంప్రదించాలి.
18న చలో ఢిల్లీ
తిరుపతి కల్చరల్: బీసీల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈనెల 18,19వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయనున్న తరుణంలో ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీ సంఘాల ప్రతినిధులందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వర యాదవ్, దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్ షణ్ముగం, జిల్లా అధ్యక్షుడు తురక అమరనాథ్ పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కరపత్రాలను జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించి మాట్లాడారు. బీసీల సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి కొండా రామారావు, జ్ఞానశేఖర్, రవి, శరవణ, సందీప్, వెంకటేష్, కిషోర్, బీసీ నేతలు పాల్గొన్నారు.
1న పెన్షన్ మార్చ్
జయప్రదం చేయండి
తిరుపతి కల్చరల్ : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న విజయవాడ, గుంటూరు మధ్య భారీ స్థాయిలో చేపట్టే పెన్షన్ మార్చ్‌లో ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ పిలుపు నిచ్చారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పెన్షన్ మార్చ్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి ప్రసంగించారు. 20 ఏళ్లుగా రాష్ట్రంలోని 4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు పెన్షన్ రాకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అయినా సీపీఎస్ రద్దుపై కనీసం ఉద్యోగులతో చర్చలు జరపలేదన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ వెన్నుపోటు పొడిచిన రోజుగా భావిస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ మార్చ్ చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అద్యక్షుడు వంకీపురం పవన్, ఏపీ ప్రభుత్వం ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రయ్య, కోశాధికారి శ్రీనివాసులు, చలపతి పాల్గొన్నారు.