
కూటమి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
తిరుపతి మంగళం:కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలతో ఎండగడుతున్నామనే కక్షతోనే వైఎస్సార్‌సీపీతో పాటు తమ కుటుంబంపై కూటమి నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎయి ర్ బైపాస్‌రోడ్డు, న్యూబాలాజీ కాలనీలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులకు క్రమశిక్షణ తరగతులు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబద్దత, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవ్వరూ వ్యవహరించమంటూ పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి న హామీలను అమలు చేయకుండా మోసం చేస్తు న్న కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిరుపతి నుంచి ఎండగడుతూ కూటమి నాయకుల గుండెల్లో దడ పుట్టిస్తున్నామన్నారు. అది కూటమి నాయకులు జీర్ణించుకోలేక ఎల్లో సోషయల్ మీడియాలో వైఎస్సార్‌సీపీతో పాటు భూమన కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు పోస్టింగ్లు పెడుతూ బురదజల్లే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి నగరంలో కూటమి దుష్ప్రచారాలను తిప్పికొట్టేలా వైఎస్సార్‌సీపీ సోషయ ల్ మీడియా చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ లోపాలను ప్రజల కు వివరిస్తూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పనిచేయాలన్నారు. కూటమి చేస్తున్న దుష్ప్రచారాలకు భయపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను
ఎండగడుతున్నామనే కక్ష
పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేసిన భూమన అభినయ్‌రెడ్డి