గూడు చెదిరె.. గోడు మిగిలె! | - | Sakshi
Sakshi News home page

గూడు చెదిరె.. గోడు మిగిలె!

Aug 11 2025 7:27 AM | Updated on Aug 11 2025 7:27 AM

గూడు

గూడు చెదిరె.. గోడు మిగిలె!

నాడు సక్రమం.. నేడు అక్రమం
● ఇష్టానుసారంగా పేదల ఇళ్లు కూల్చివేత ● ప్రజాప్రతినిధి ఆదేశాలు పాటిస్తూ రెచ్చిపోతున్న అధికారులు ● ఏడాదిలో వెయ్యి వరకు పేదల ఇళ్లు కూల్చివేత

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: సొంతింటి కల.. సగటు పేదవాని జీవితంలో తీరని స్వప్నం.. ఎంత రెక్కల కష్టం చేసినా నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లటానికి అపసోపాలు పడుతున్న బడుగు జీవులు రూపాయి, రూపాయి కూడబెట్టుకుని గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్మించుకున్న ఇళ్లను ముఖ్యనేత ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కనీసం కనికరం చూపకుండా పేదల ఆశల గూళ్లను నేలమట్టం చేస్తున్నారు. అప్పట్లో అదే రెవెన్యూ శాఖలోని అధికారులే ఇళ్లు నిర్మించుకుంటుంటే అవి అక్రమమని తెలిసి ఎందుకు అడ్డుకోకుండా ఎంజాయ్‌మెంట్‌ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం అదే అధికారులు ఎవరి మెప్పు కోసం కూల్చుతున్నారోనని పేదల శాపనార్థాలు అరణ్యరోదనగా మిగిలాయి.’

నియోజకవర్గంలో శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో అక్రమ నిర్మాణాల పేరుతో సుమారు వెయ్యి ఇళ్లు నేలమట్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఓ వైపు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులపై భౌతిక దాడులను చేయడంతోపాటు అక్రమ కేసులు బనాయించి తీవ్ర భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. మునుపెన్నడూ లేని సంస్కృతికి భీజం వేశారు. తాజాగా మూడు రోజుల కిందట రేణిగుంట మండలం కుర్రకాల్వలో అక్రమ నిర్మాణాలని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసు, రెవెన్యూ బలగాలతో 77 ఇళ్లు కూల్చివేశారు.

గతంలో రెవెన్యూ అధికారులే...:

గతంలో రేణిగుంట మండలంలోని పేదలకు ఏర్పేడు మండలం పాగాలి సమీపంలో జగనన్న కాలనీ వద్ద ఇళ్లను కేటాయించి, ఇంటి పట్టాలు మంజూరు చేశారు. అయితే రైతుల నుంచి తీసుకున్న భూముల పరిహారాన్ని కొంతమంది రైతులకు మాత్రమే వేసి, మిగిలిన రైతులకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేశారు. దీంతో రైతులు అడ్డుకోవడంతో అక్కడ స్థలాలు చూపే పరిస్థితి లేకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి స్థానికులు ఇంటిస్థలాల కోసం మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన సమస్యను పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారులను కోరడంతో కొంతమందికి మండలంలోని మిగులు భూముల్లో ఇంటిస్థలాలకు కేటాయించారు. లబ్ధిదారులకు ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్లు, ఇంటి పన్నులు మంజూరు చేశారు. దీంతో పేదలు అప్పు చేసి చిన్నపాటి రేకుల షెడ్లను నిర్మించుకున్నారు. అప్పట్లో నిర్మించిన ఈ ఇళ్లన్నీ అక్రమం అయితే నిర్మాణ దశలో రెవెన్యూ అధికారులు కళ్లుమూసుకుని విధులు నిర్వహించారా..? అని పేదలు ప్రశ్నిస్తున్నారు.

మా ఉసురు తగులుతుంది..

కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లం.. సొంతిల్లు లేకుండా బాడుగ కట్టలేక ఎన్నో అవస్థలు పడ్డాం. గత ప్రభుత్వంలో మాకు ఇంటి స్థలం చూపారు. రూ.లక్ష అప్పు చేసి ఇళ్లు నిర్మించుకున్నాం. అప్పట్లో రెవెన్యూ అధికారులు మాకు అనుభవ పట్టాలు ఇచ్చారు. ఇంటిపన్ను వేశారు. కరెంటు మీటర్లు తీసుకున్నాం. అయినా అక్రమ నిర్మాణాలు అని చెప్పి ఉన్న పళంగా మా ఇళ్లన్నీ కూల్చేశారు. ప్రాధేయపడినా కనికరించలేదు. మా ఉసురు తగులుతుంది. – ఏసమ్మ,

పద్మనగర్‌, కుర్రకాల్వ, రేణిగుంట మండలం

పేదలపై ఎందుకు కక్ష

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నియోజకవర్గంలో అధికారులు ఎందుకో పేదలపై కక్ష కట్టారు. ఎవరి మెప్పు కోసమో పేదలను మరింత అప్పుల ఊబి లోకి నెట్టేస్తున్నారు. అవి అక్రమ నిర్మాణాలైతే ఇళ్లు కట్టుకుంటున్న సమయంలో రెవెన్యూ అధికారులకు కనిపించలేదా? నియోజకవర్గంలో వందల ఎకరా లు పెద్దలు ఆక్రమించుకుని దర్జాగా వెంచర్లు వేసుకు ని అమ్ముకుంటుంటే అవేమీ రెవెన్యూ అధికారులకు కనబడలేదా? – హరినాథ్‌, గిరిజన సంక్షేమ సంఘం

జిల్లా నాయకుడు, రేణిగుంట

అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు..

నియోజకవర్గంలో అధికారు లు పూర్తిగా ఎమ్మెల్యేకు తొత్తు గా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు అన్ని చోట్ల దోచుకుంటూనే మరో పక్క పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు. బడా బాబులకు వందల ఎకరాలు భూములు ఉచితంగా కట్టబెడుతున్న ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గం. రూ.లక్షలు అప్పు చేసి ఇళ్లు కట్టుకుంటే కూల్చివేయించటం చాలా దుర్మా ర్గం. రాష్ట్రంలో ఎక్కడా లేని సంస్కృతి శ్రీకాళహస్తిలో నే జరుగుతోంది. మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తాం. – బియ్యపు మధుసూదన్‌రెడ్డి,

మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి

యంత్రాలతో ఇళ్లు కూల్చివేస్తున్న అధికారులు

కూల్చివేయనందుకే తహసీల్దార్‌ బదిలీ

అక్రమ నిర్మాణాల పేరుతో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఇళ్లను కూల్చివేయనందుకు రేణిగుంటకు చెందిన గత తహసీల్దార్‌ను బదిలీ చేశారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆదేశాలే ప్రభుత్వ నిబంధనలు అన్నట్లుగా వ్యవహరిస్తూ పేదలపై ప్రతాపం చూపుతున్నారు. కొన్ని నెలల కిందట రేణిగుంట మండలంలోని చెంగారెడ్డిపల్లి ఎస్టీ కాలనీలో ఎస్టీలకు చెందిన ఇళ్లను పోలీసు బలగాలతో తలుపులు మూయించి అర్ధరాత్రి లైట్లు ఆపి, జేసీబీలతో ఇళ్లన్నీ నేలమట్టం చేశారు.

పేదల ఇళ్లే లక్ష్యంగా దౌర్జన్యకాండ

శ్రీకాళహస్తి పట్టణంలోని రాజవ్‌నగర్‌లో 300 ఇళ్లకు పైగా నేలమట్టం చేసి సుమారు రూ.5 కోట్లు మేరకు పేదల ఆస్తులకు నష్టం కలిగించారు. రేణిగుంట మండలంలో తూకివాకం పంచాయతీ వివేకానంద కాలనీలో 125 ఇళ్లు, సీబీఐడీ కాలనీ 28 ఇళ్లు, కుర్రకాల్వ పద్మానగర్‌ 150 ఇళ్లు, చెంగారెడ్డిపల్లిలో 135 ఇళ్లు, వెంకటాపురం పంచాయతీ పరిధిలో 40 ఇళ్లు కూల్చివేశారు.

గూడు చెదిరె.. గోడు మిగిలె!1
1/6

గూడు చెదిరె.. గోడు మిగిలె!

గూడు చెదిరె.. గోడు మిగిలె!2
2/6

గూడు చెదిరె.. గోడు మిగిలె!

గూడు చెదిరె.. గోడు మిగిలె!3
3/6

గూడు చెదిరె.. గోడు మిగిలె!

గూడు చెదిరె.. గోడు మిగిలె!4
4/6

గూడు చెదిరె.. గోడు మిగిలె!

గూడు చెదిరె.. గోడు మిగిలె!5
5/6

గూడు చెదిరె.. గోడు మిగిలె!

గూడు చెదిరె.. గోడు మిగిలె!6
6/6

గూడు చెదిరె.. గోడు మిగిలె!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement