మహిళా వర్సిటీలో రోడ్డు పనులు ప్రారంభం
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 21 అడుగుల రోడ్డు నిర్మాణ పనులను వీసీ ప్రొఫెసర్ వి.ఉమ బుధవారం ప్రారంభించారు. తుడా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సుమారు రూ. 38 లక్షల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి హ్యుమానిటీస్ బ్లాక్– 2 వరకు రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజనిపాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీకి 835 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో భాగంగా బుధవారం నిర్వహించిన మ్యాథ్స్–1ఏ, 2ఏ, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 835 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షకు 16,256మంది, ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్‌కు 1,981మంది హాజరైనట్లు వివరించారు.
పంట కోత ప్రయోగం విజయవంతం
పాకాల : మండలంలోని ఈ–పాలగుట్టపల్లెలో ఎస్.బాలరాజునాయుడు అనే రైతు పొలంలో చేపట్టిన వరి కోత ప్రయోగం విజయవంతమైనట్లు ఎంసీఆర్‌పీ రాధాకృష్ణ తెలిపారు. బుధవారం ఈ మేరకు ప్రకృతి వ్యసాయంలో పండించిన వరి పంటను ఐదుకు ఐదుకు పరిధిలో పంట కోత చేపట్టారు. ఈ క్రమంలో పంట 14 కేజీల 516 గ్రాముల దిగుబడి వచ్చిందని అధకారులు వెల్లడించారు. ప్రకృతి వ్యసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఐడీఆర్‌ఏపీ ఇన్వెస్టిగేటర్ గిరి పాల్గొన్నారు.
ఖేలో ఇండియాలో సత్తా చాటిన లక్ష్మీసిరి
గూడూరురూరల్ : బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా పోటీల్లో గూడూరుకు చెందిన లక్ష్మీసిరి సత్తా చాటింది. మంగళవారం జరిగిన టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం కై వసం చేసుకుంది. అలాగే డబుల్స్ విభాగంలో రజత పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా బుధవారం లక్ష్మీసిరి తండ్రి దండు మహేష్‌రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
ఖేలో ఇండియాలో సత్తా చాటిన లక్ష్మీసిరి


