వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యం
● జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం ● రామ్‌కుమార్‌రెడ్డి, నాగార్జున యాదవ్
సైదాపురం : క్షేత్రస్థాయి నుంచే వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్ తెలిపారు. బుధవారం వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి భవన్‌లో బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి పట్టణం, రూరల్ పరిధిలోనినేతలు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసాతో కేడర్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తోందన్నారు. వలంటీర్ల వ్యవస్థ కారణంగా ప్రజలు, పార్టీ నేతల మధ్య దూరం పెరిగిందని తెలిపారు. అదే ఎన్నికల్లో నష్టం చేకూర్చిందన్నారు. నాగార్జున యాదవ్ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేడర్, వలంటీర్ల వ్యవస్థీకరణకు అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వెంకటగిరి నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఎంపిక చేసిందని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా విజయవంతం చేయడంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయనపై జగనన్నకు సైతం పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. మున్సిపల్ చైర్మన్‌పై కూటమి నేతలు కుట్రపూరితంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో రామ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్ట ఇనుమడించిందని వివరించారు. కార్యసాధకుడిగా జగనన్న వద్ద మంచి పేరు తీసుకువచ్చిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే పహల్‌గామ్ మృతులకు నేతలు, కార్యకర్తలు అంజలి ఘటించారు.
ప్రజా సమస్యలపై పోరాటం
సైదాపురం : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం సాగించాలని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వెంకటగిరి పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో డక్కిలి, బాలాయపల్లె, వెంకటగిరి మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమీక్షించారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి నేతల ఆదేశాల మేరకు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే జమిలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్లీ అధికార పగ్గాలు చేపడతారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్లు ప్రసాద్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.


