అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు అంటూ భక్తులు ప్రార్థించారు. జాతరలో భాగంగా మూడోరోజు శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి పోటెత్తారు. తోటి వేషాలు ధరించి మొక్కులు చెల్లించుకున్నారు.
కుటుంబసమేతంగా ఆలయ
ఆవరణలో పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు.
భక్తిశ్రద్ధలతో అమ్మవారిని
సేవించుకుని తన్మయత్వం
చెందారు. ఈ క్రమంలో నాలుగోరోజు శనివారం కై కాల, రజక కులస్తులు అనువంశిక వేషాలతో పురవీధుల్లో సంచరిస్తూ పూజలందుకోనున్నారు. అనంతరం గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు.
– తిరుపతి కల్చరల్