ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి, లోకేష్, ప్రధాన నాయకులుగా ఉన్నవారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధినాయకులే నేర చరిత్ర కలిగి ఉంటే ఆ పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణులు సైతం నేరాలు చేయడంలో ఆరితేరిపోయారు. మోసాలు.. కబ్జాలు.. దాడులు.. అల్లర్లు.. హత్యలకు పాల్పడి విచారణ ఎదుర్కొంటున్నారు.
నిత్యం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే ప్రధాన అర్హతగా చూపించి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అయితే తమ్ముళ్ల నేరాల చరిత్ర తెలిసిన సామాన్యులు మాత్రం ఎన్నికల నాటికి ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తోందో అని భయాందోళనకు గురవుతున్నారు.


