కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి | YSRCP MP Krishnaiah On BR Ambedkar | Sakshi
Sakshi News home page

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి

Sep 21 2023 1:07 AM | Updated on Sep 21 2023 1:07 AM

YSRCP MP Krishnaiah On BR Ambedkar - Sakshi

మాట్లాడుతున్న కృష్ణయ్య. చిత్రంలో చెన్నయ్య

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోలు కరెన్సీ నోట్లపై ముద్రించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో పోరాటానికి కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జేరిపోతుల పరశురామ్‌ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆర్‌బీఐ ఏర్పడటానికి పునాది అయిన అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలన్నారు. పరశురామ్‌ మాట్లాడు తూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని ఐదేళ్ల నుంచి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధ యాత్ర, ప్రజా చైతన్య యాత్ర, సైకిల్‌ యాత్ర నిర్వహించి ఢిల్లీలో 13 సార్లు ధర్నా నిర్వహించామని గుర్తుచేశారు.  

నేడు పార్లమెంట్‌ వద్ద ప్రదర్శన 
మహిళా బిల్లులో బీసీల వాటా కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళా బిల్లు నేపథ్యంలో  ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీల వాటాను స్పష్టం చేస్తూ బిల్లులో పొందుపర్చాలన్నారు. మహిళా బిల్లులో బీసీల వాటాపైనా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement