భారత్‌బంద్‌కు వైఎస్‌ షర్మిల మద్దతు

YS Sharmila Support For Bharat Bandh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు చట్టాలను రద్దు చేయాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించనున్న భారత్‌బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. శనివారం ఈ మేరకు ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్‌ భరత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులను కోరారు.

ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ఎండగట్టాలని విజ్ఞప్తిచేశారు. మోసకారి ప్రభుత్వం తల వం చేందుకు తాను పాదయాత్రను చేపట్టబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పేదోడి పొట్టకొట్టే రాబందుల రెక్కలు తుంచేందుకు, ప్రజలను పీడించే పాలకుల భరతం పట్టేందుకు వస్తున్నా.. అని షర్మిల అన్నారు.  చదవండి: (నేడే భారత్‌ బంద్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top