న్యూఢిల్లీ: నేడు(బుధవారం) కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రాజధాని ఢిల్లీ నుండి దక్షిణాది రాష్ట్రం కేరళ వరకు పలు ట్రేడ్ యూనియన్లతో సంబంధం కలిగిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చిన తమ నిరసన తెలియజేస్తున్నారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు ట్రేడ్ యూనియన్ల నేతలు, కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేరళ, తమిళనాడులలో కూడా ట్రేడ్ యూనియన్ కార్మికులు నిరసనల్లో పాల్గొన్నారు. దేశంలోని 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. ఈ బంద్‌లో మొత్తం 25 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని వివిధ యూనియన్లు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలు.. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తూ, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి.
#WATCH | Kozhikode, Kerala | Effects of 'Bharat Bandh' called by a joint forum of 10 central trade unions, alleging the central govt of pushing "pro-corporate" policies. pic.twitter.com/AesjtEoO9O
— ANI (@ANI) July 9, 2025
కేరళలోని కోజికోడ్‌లో భారత్ బంద్ ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. యూపీలోని సాహిబాబాద్, ఘజియాబాద్‌లోని లింక్ రోడ్‌లో కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఢిల్లీలోని జిల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ట్రేడ్ యూనియన్లు బంద్ చేపట్టాయి. కోల్‌కతాలో వామపక్ష పార్టీల యూనియన్ భారత్ బంద్‌లో భాగంగా పాదయాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను బలహీనపరిచే ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నదని వారు ఆరోపిస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాలు యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులుగా, పదవీ విరమణ చేసిన వారిని తిరిగి నియమించుకుంటున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి.
తమిళనాడులోని తూత్తుకుడిలో కార్మిక సంఘం ప్రతినిధి సఖాయం మాట్లాడుతూ, తూత్తుకుడి కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఒక రోజు సమ్మె చేశారని అన్నారు. అయినా దీనిపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కాగా భారత్ బంద్‌లో భాగంగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వామపక్ష సంఘం రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతున్నదని తెలిపింది.
బీహార్‌లో 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక నిరసనలకు పిలుపునిచ్చింది.