
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తరచూ అనేక శాస్త్ర, వైజ్ఞానిక అంశాలను తన అభిమానులతో పంచుకునే ఇపుడు ఆయన ప్రకృతికి సంబంధించిన విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని కడమక్కుడి (Kadamakkudy) గ్రామంపై ఆయన ప్రశంసలు కురపించారు. ఈ భూమి మీద అత్యంత అందమైన గ్రామాల జాబితాలో ఇది తరచూ నిలుస్తుందని ట్వీట్ చేశారు. సండే వండర్ అంటూ ఈ అందమైన గ్రామం గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించి అందమైన వీడియోను షేర్ చేశారు. అంతేకాదు కడమక్కుడి సందర్శనను తన ‘బకెట్ లిస్ట్’లో ఉందని, ఈ ఏడాది డిసెంబర్‌లో వ్యాపార పర్యటన నిమిత్తం తాను కొచ్చికి వెళ్తున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే కొచ్చి నుంచి ఈ గ్రామం కేవలం అరగంట దూరంలో ఉందన్నారు. పల్లెకు సంబంధించిన అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన వీడియోనూ పోస్ట్ చేశారు.
Kadamakkudy in Kerala.
Often listed amongst the most beautiful villages on earth…
On my bucket list for this December, since I’m scheduled to be on a business trip to Kochi, which is just a half hour away…#SundayWanderer pic.twitter.com/cQccgPHrv9— anand mahindra (@anandmahindra) July 6, 2025
కాగా జాతీయ రహదారి 66 కి సమీపంలో, కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉంటుంది కడమక్కుడి అనేగ్రామం.కేరళ సంప్రదాయ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా మనోహరమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని పంటపొలాలు, కనువిందు చేసే బ్యాక్ వాటర్స్‌తో అలరారుతూ ఉంటుంది. కడమక్కుడిని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్, మార్చి గా చెబుతారు. ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్రత్యేకతలు
14 చిన్న చిన్న దీవులతో కూడిన సుందరమైన ద్వీపసమూహం.
కడమక్కుడి సమీపంలోనే శతాబ్దాల చరిత్ర కలిగిన సెయింట్ జార్జ్ ఫోరెన్ చర్చి, వల్లర్పదం బసిలికా, మంగళవనం పక్షుల అభయారణ్యం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి
.సుస్థిర వ్యవసాయం,చేపలు పట్టడం , వ్యవసాయంలో మునిగిపోయిన స్థానికులకు జీవనోపాధి
పర్యావరణ వ్యవస్థను రక్షించి, పోషించే మడ అడవులు
అరుదైన వలస పక్షులను చూడాలనుకునేవారికి నిజంగా ఇది స్వర్గధామం