శశిథరూర్‌ ‘చిలక పలుకుల’పై కాంగ్రెస్ సెటైర్లు | Manickam Tagore Hits Out At Shashi Tharoor Over Emergency Comments, Posts Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

శశిథరూర్‌ ‘చిలక పలుకుల’పై కాంగ్రెస్ సెటైర్లు

Jul 10 2025 5:37 PM | Updated on Jul 10 2025 6:16 PM

Manickam Tagore hits out at Shashi Tharoor over Emergency comments

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌పై.. ఆ పార్టీ తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ పేరు ప్రస్తావించడకుండా సెటైర్లు వేశారు.  

ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ ప్రాజెక్ట్‌ సిండికేట్‌లో ఎంపీ శశిథరూర్‌ గెస్ట్‌కాలమ్‌ రాశారు. అందులో ఇందిరా గాంధీ పాలనలో జరిగిన బలవంతపు స్టెరిలైజేషన్, స్లమ్ తొలగింపు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ ‘పక్షి చిలుకైందే’ అంటూ శశి థరూర్ బీజేపీ లైన్‌ను అనుసరిస్తున్నారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.

 

‘పక్షి చిలుకైందే’ అంటే స్వేచ్ఛగా ఎగిరే పక్షి.. ఇతరుల మాటలు యథాతథంగా పలికే  చిలుకలా మారింది. పక్షులు ..చిలుకల్ని అనుకరిస్తే అందంగా ఉండొచ్చేమో.. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

1975లో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా పేర్కొన్న శశిథరూర్‌ నాటి దుర్భుర పరిస్థితుల్ని గెస్టు కాలంలో ప్రస్తావించారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్‌ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బలవంతపు వాసెక్టమీ కార్యక్రమాలు నిర్వహించారు.

పేదలు నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారిపై దాడులు చేయడం, న్యూఢిల్లీలాంటి నగరాల్లో మురికి వాడల్లో నివాసాల్ని కూల్చివేయడం, అక్కడ నివసించే వారిని ఖాళీ చేయించారు. ఫలితంగా వేలాది మంది నిట్ట నిలువ నీడలేక నిరాశ్రయులయ్యారు. వారి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని గుర్తు చేశారు.

 

ఇలా ఇప్పుడే గతంలో కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తూ శశిథరూర్‌ పలు కామెంట్లు చేశారు. రెక్కలు నీవీ.. ఎగిరేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. ఆకాశం ఏ ఒక్కరిది కాదని ట్వీట్‌ చేశారు.

అందుకు మాణిక్యం ఠాకూర్‌ మరో ట్వీట్‌లో ఎగిరేందుకు అనుమతి అడగొద్దు.‘పక్షులు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదు.. కానీ ఈ రోజుల్లో, స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. గద్దలు, రాబందులు, ఈగల్స్  ఎప్పుడూ వేటలో ఉంటాయి. స్వేచ్ఛ ఉచితం కాదు.  ముఖ్యంగా వేటగాళ్లు దేశభక్తిని రెక్కలుగా ధరించినప్పుడు’బదులిచ్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement