breaking news
emergency time
-
క్రిటికల్ కేర్ తక్షణ.. రక్షణ!
‘‘ఆయనది చాలా క్రిటికల్ కండిషన్ అట!’’... ఒకరికి చాలా సీరియస్‌గా ఉన్నప్పుడు చాలామంది ఈ మాట వాడుతుంటారు. కార్డియాలజీ, న్యూరాలజీ... ఇలాంటి అనేక విభాగాల్లాగే ‘క్రిటికల్ కేర్’ అనేది కూడా ఒక విభాగం. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలతో పాటు ఇలాంటి అన్ని విభాగాల వారికీ చికిత్స అందించే అత్యంత కీలక విభాగమిది. అయితే... వైద్యశాస్త్ర పరిజ్ఞానం ఉన్న కొందరు తప్ప... చాలామంది క్రిటికల్ కేర్నూ, ఎమర్జెన్సీ విభాగాన్నీ ఒకటే అనుకుంటారు. కానీ అది సరికాదు. కానీ... క్రిటికల్ కేర్ అన్నా లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నా దాదాపుగా ఒకటే. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలకు ప్రత్యేకంగా ఐసీసీయూ (ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఇలా చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వేర్వేరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండవచ్చు. కానీ ఓ మోస్తరు పెద్ద హాస్పిటల్స్‌లో ఒకే ఐసీయూ ఉంటుంది. క్రిటికల్ పరిస్థితుల్లో ఉండే బాధితులకు ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్‌లో అందే చికిత్సలూ, అందజేసే నిపుణులైన డాక్టర్లు... ఆ క్రిటికల్ కేర్ ప్రత్యేకతలేమిటో చూద్దాం.క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ ఒకటి కాదు. ఎమర్జెన్సీ అంటే... ఏదైనా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న బాధితులప్రాణాలు నిలిపేందుకు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉంచి చికిత్స అందించి... ఇకప్రాణాలు నిలుస్తాయన్న తర్వాత క్రిటికల్ కేర్ / ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి అక్కడ మాత్రం చాలా సేపు ఉంచి చికిత్స అందించి, ఒక వార్డుకు లేదా రూమ్‌కు తరలించి చికిత్స అందిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీ కొద్ది కాలం... క్రిటికల్ కేర్‌లో కాస్తంత ఎక్కువ కాలం చికిత్స అందిస్తారు.క్రిటికల్ కేర్కూ, ఎమర్జెన్సీకీ ఇదీ తేడా...మనకు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. విషం తీసుకున్న ఒక వ్యక్తిని ఎమర్జెన్సీకి తీసుకురాగానే... ఒక సెకండ్లోని చాలా సూక్ష్మమైన భాగం అంటే క్షణాల్లోనే గొంతులోకి పైప్ వేయగలంత సమర్థులు ఎమర్జెన్సీలో ఉంటారు. అలా ఆ గొట్టం ద్వారా కడుపులో ఉన్న విషాన్ని బయటకు తీసుకువస్తారు. అలాగే ఓ రోడ్డు యాక్సిడెంటు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైనవారినీ (ట్రామా కేసు) లేదా గుండెపోటు వచ్చినా, పక్షవాతానికి గురైనా... తక్షణప్రాణాపాయం ఉన్నవారికి... తక్షణ వైద్యసేవ అందాల్సిన అవసరం ఉన్న వ్యక్తికి... ఆ తక్షణ చికిత్స అందేలా చేసేదే ఎమర్జెన్సీ వార్డు. ఇక అలా ఎమర్జెన్సీ చికిత్స అందిన తర్వాత... అప్పటికప్పుడు వచ్చే ప్రమాదం తప్పినప్పటికీ... తక్షణ అవసరం పెద్దగా ఏదీ లేకపోయినా... పూర్తి ప్రమాదం ఇంకా ఉండనే ఉందనీ, కొంతకాలం పాటు చాలా అప్రమత్తంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిశాక... అంతటి అప్రమత్తతతో పేషెంట్స్‌ను చూసుకునే విభాగమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా క్రిటికల్ కేర్ యూనిట్. ఎమర్జెన్సీలో ఉండే అన్ని రకాల అప్రమత్తమైన సేవలూ క్రిటికల్ కేర్‌లో ఉన్నప్పటికీ... ఇక్కడ పేషెంట్‌ను ఎమర్జెన్సీ వార్డులో కంటే ఎక్కువ సేపు ఉంచి చికిత్స అందిస్తారు. కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనప్పటికీ... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటారు. ఇందుకోసం క్రిటికల్ కేర్ డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. పేషెంట్ జీవితాన్ని కాపాడాటానికి రోజులోని 24 గంటలూ అంతే సావధానంగా ఉంటారు. అందుకే వీళ్లను ఇంటెన్సివిస్ట్స్ అని కూడా అంటారు.ఇక్కడి పేషెంట్స్ ఎవరంటే...?తక్షణ చికిత్స అందక అలాగే వదిలేస్తే కొద్ది క్షణాల్లోనేప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న పేషెంట్స్‌ను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు. అత్యవసరంగా వైద్యసేవలు అవసరమైన రోగులు ఆసుపత్రిలో తొలుత వచ్చే ప్రదేశమిది. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా రోడ్డు / వాహన / రైలు ప్రమాదానికి గురైనవారు, అగ్నిప్రమాదాల బారిన పడ్డవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్కు గురై తక్షణ చికిత్స అవసరమైనవారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు.అన్ని విభాగాలలోనూ నిష్ణాతులు... క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్టులు ఒక పేషెంట్స్‌కు... ఏ ప్రత్యేకమైన దేహభాగం లేదా అవయవానికి (గుండె లేదా మెదడు... ఇలా) లేదా ఓ వ్యవస్థకు (కార్డియాలజీ / న్యూరాలజీ / గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థ) ఎలాంటి వైద్యచికిత్స అవసరమో... ఆ డాక్టర్‌తో పాటు మిగతా అనుబంధ విభాగాలలోని ఆ డాక్టర్ల బృందమంతా వెంటనే పేషెంట్‌కు చికిత్స అందించడం మొదలుపెడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్‌కు లోనైనప్పుడు మొదట తలకు దెబ్బతగిలి ఉండే న్యూరో సర్జన్‌తో పాటు ఎముకలకు ఏదైనా హాని జరిగిందేమోనంటూ ఆర్థోపెడిక్ సర్జన్... అలాగే ఆ దెబ్బ తగిలిన చోటును బట్టి రక్తప్రసరణ వ్యవస్థకు ఏదైనా విఘాతం కలిగితే దానికి సంబంధించిన నిపుణులు... ఇలా అవసరాన్ని బట్టి ప్రధాన వైద్య నిపుణులతో బాటూ ఇతర నిపుణులూ కలిసి పనిచేసి పేషెంట్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తారు. అలా మొదటగా అతడిలోని జీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఇలాంటి పత్యేక శిక్షణ పొందిన వైద్యులను ‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. అంటే వాళ్ల చికిత్స చాలా కేంద్రీకృతంగా, తక్షణం పేషెంట్ప్రాణాలను రక్షించడం కోసమే అయి ఉంటుంది. ఈ ఇంటెన్సివిస్ట్లందరూ కేవలం ఒక నిర్ణీతమైన దేహవ్యవస్థా లేదా ఓ నిర్దిష్టమైన అవయవం విషయంలోనే కాకుండా... పూర్తిగా అన్ని శారీరక దేహ వ్యవస్థలూ (అంటే నాడీ, జీర్ణ, రక్తప్రసరణ, గుండె ఇలా అన్ని రకాల వ్యవస్థలూ), దేహభాగాలూ / అవయవాలన్నింటిపైనా మంచి పట్టు, వాటి చికిత్సల్లో అద్భుతమైన నైపుణ్యంగలవారిగా ఉంటారు.గతం కంటే ఇప్పుడు మరిన్ని నైపుణ్యాలతోనూ ఇంకింత ప్రత్యేకంగా... దాదాపుగా గత మూడు శతాబ్దాల క్రితం అన్ని రంగాలకు చెందిన వైద్యులంతా ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్/క్రిటికల్ కేర్ విభాగంలో ఉండేవారు. అన్ని రకాల సేవలూ అక్కడే దొరికేవి. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం, అత్యున్నతమైన సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... పేషెంట్లను ఉంచే ప్రదేశాలూ, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా మారాయి. ఉదాహరణకు... శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, పేషెంట్స్‌కు సంబంధించిన అన్ని రకాల కీలకమైన రీడింగ్స్‌ను తీసుకునే అత్యున్నత స్థాయి పరిజ్ఞానం కలిగిన సున్నితమైన (ప్రెసిషన్గా పనిచేసే సెన్సిటివిటీ ఎక్కువగా ఉండే) పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా దేహంలో లేదా రక్తంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ ఏ రంగానికి కావాల్సినవి ఆ రంగాలకు చెందిన ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఇప్పుడు అమర్చి ఉంచుతున్నారు.అన్నింటా పురోగతితో పాటు అత్యవసర వైద్యసేవల్లో కూడా...ఇప్పటితో పోలిస్తే కొద్ది కాలం కిందట వైద్యచికిత్సలు ఇప్పటికంటే కాస్త నింపాదిగా, కాస్తంత మెల్లగా సాగేవి. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో పేషెంట్లు చనిపోవడం లాంటి దుర్ఘటనలే ఎక్కువగా చోటుచేసుకునేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడంతో ఈ చికిత్స అందించే క్రమంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ఎంత వేగంగా హాస్పిటల్‌కు తీసుకొస్తే అంతటి ఉత్తమమైన / వేగవంతమైన చికిత్స అందేలాగా... దానికి అనుగుణంగానే ప్రభావాలు (రిజల్ట్స్) కనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. ఉదాహరణకు... పెను ప్రమాదాలేవైనా సంభవించినప్పుడు... అది జరిగిన మొదటి అరగంటలోనే పేషెంట్స్‌ను తీసుకువస్తే... ఆ వ్యవధిని ΄్లాటినమ్ మొమెంట్స్ అని,ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మొమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మొమెంట్స్... అంటూ అభివర్ణిస్తున్నారు. అంటే గోల్డెన్ మొమెంట్స్లోప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్‌స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్స్పెషాలిటీలు రావడం మొదలైంది. ఈ మార్పుకు తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు సైతం తమ తమ విభాగాల్లో ఇంకా ప్రత్యేకతలను సంతరించుకోవడం మొదలుపెట్టాయి. అత్యాధునిక ఉపకరణాలు,ప్రాణాలను కాపాడేందుకు కొత్త కొత్త అత్యాధునిక వైద్యసేవలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ యూనిట్లలోకి కొత్త పరికరాలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.) తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనే ప్రత్యేక విద్యార్హత / ప్రత్యే శిక్షణ పొందాల్సి ఉంటుంది.ఇక్కడి నిపుణుల ప్రత్యేకత ఏమిటంటే...ఏదైనా ఒక అవయవానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమవుతుంది. కొంతకాలం తర్వాత అది మరింతగా తీవ్రమైతే ΄÷రుగునే ఉన్న అవయవాలకూ లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, సంబంధిత వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలైతే... అది కేవలం గుండెకే పరిమితం కాకుండా... రక్తసరఫరా సరిగా జరగకపోవడంతో మెదడుకు కూడా రక్తం అందకపోవడం, దాని పనితీరూ ప్రభావితం కావడం జరుగుతాయి. మెదడు అన్ని కీలక అవయవాలను నియంత్రిస్తుంటుంది కాబట్టి దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోయేందుకు అవకాశాలు పెరుగతాయి. ఒకవేళ మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడితే గుండెనూ ప్రభావితం చేస్తుంది. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దాని వల్ల ప్రభావితమైన అవయవాలూ పనిచేయకుండా పోయే కండిషన్‌ను ‘మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్’ అంటారు. ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని ‘మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్’గా చెబుతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్‌లోని డాక్టర్లందరూ నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో పనిచేసే వైద్యులకు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి సంబంధించిన పరిజ్ఞానమో లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే అత్యంత సంక్లిష్టమైనప్రాణాపాయాన్ని నివారించే విధులు నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి.ఉదాహరణకు ఒక కేస్ స్టడీ...ఒక వ్యక్తికి నిమోనియా సోకిందనుకుందాం. నిజానికి నిమోనియా లంగ్స్‌కు సంబంధించిన సమస్య. దేహంలోని ఎన్నో వ్యవస్థల్లో ‘శ్వాసకోశ వ్యవస్థ’ ఒకటి. నిమోనియా ఆ వ్యవస్థ కిందికి వస్తుంది. సాధారణంగా నిమోనియా చికిత్స కోసం యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే చాలు. కానీ ఏవైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండా పోయి... పేషెంట్‌కు శ్వాస అందకపోతే ఆక్సిజన్ పెట్టాలి. కృత్రిమ శ్వాస ఇవ్వడానికి వెంటిలేటర్ అవసరం. ఒకవేళ లంగ్స్ కు ఉన్న ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్‌గా మారితే అప్పుడు కేవలం యాంటీబయాటిక్స్‌తో మాత్రమే చికిత్స చేస్తే సరిపోదు. ఆ పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాలి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి. రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చూడాలి. ఒక్కోసారి అతడికి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్‌లంగ్ బైపాస్ అనే చికిత్సనూ అందించాల్సి రావచ్చు. ఇలా చేయడాన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్’ అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి కిడ్నీలకు పాకితే... అప్పుడతడి రక్తంలోని వ్యర్థాలను తొలగించడానికి ‘డయాలిసిస్’ అనే ప్రక్రియను నిర్వహించాలి. రక్తం పూర్తిగా కలుషితమైతే దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిస్తారు. దీన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇలాంటి సేవలెన్నో ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో దొరుకుతాయి.ఇదో టీమ్ స్పిరిట్‌తో కూడిన ప్రక్రియఅత్యంత సంక్లిష్టమైన ఈ క్రిటికల్ కేర్ విభాగాల్లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాకుండా... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్‌లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్‌గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు. వీళ్లంతా ఒక టీమ్‌స్పిరిట్‌తో పేషెంట్‌ను అతడున్న సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి బయటపడేసి సేవ్ చేస్తారు. అందుకే ఈ వైద్యవిభాగాన్ని గౌరవపూర్వకంగా ‘క్రిటికల్ కేర్ మెడిసిన్’గా లేదా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందే ప్రదేశంగా అభివర్ణిస్తారు.ఎవరెవరికి ఈ సేవలుఅవసరమంటే...? సాధారణంగా చాలా పెద్దవీ, అలాగే అత్యంత సంక్లిష్టమైనవీ అయిన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక పేషెంట్ పరిస్థితి బాగా నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్‌లోనే ఉంచుతారు. వాళ్లే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చినవారూ, పక్షవాతానికి గురైన వారూ, అవయవాల మార్పిడి చికిత్స అందుకున్నవారూ, నీళ్లలో ముగినిపోయినవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కీమోథెరపీ తర్వాతా అలాగే మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలోప్రాణాంతకంగా మారినప్పుడు వారికీ ఈ క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇంకేవైనా రోడ్డు ప్రమాదాలూ, బాంబు పేలుళ్లు జరిగి అనేకమంది పదులు, వందల సంఖ్యల్లో ప్రమాదాలకు గురైనప్పుడు కూడా క్రిటికల్ కేర్ సేవలు నిరంతరం, నిరంతరాయంగా అందుతుంటాయి.నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు... అన్నీ పనివేళలే... అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సులు, సిబ్బంది పనిచేస్తుంటాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ ఇంకా గట్టిగా పనిచేస్తారు. వారు కోలుకున్న తర్వాత మళ్లీ మరొకరిప్రాణాలు రక్షించే పనుల్లో... ఇలా నిరంతరమూ తమ పనుల్లో నిమగ్నమవుతుంటారు.అంతరాయాలను నివారించేందుకు కొద్దిమందికే అనుమతి... ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పనులు సాఫీగానూ లేదా అంతరాయాలు లేకుండా కొనసాగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా మాత్రమే అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సివచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా పేషెంట్స్‌కు మేలు చేసేందుకు ఉద్దేశించినవే. అక్కడ (ఐసీయూలో) ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదలను బాగా తగ్గించడానికే. ఆగిన గుండెను మళ్లీ స్పందిచేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేసే సిబ్బంది వంటి ప్రత్యేక నిపుణులు అక్కడ ఉంటారు. ఈ సంయుక్త సేలవన్నింటి వల్ల ఇప్పుడు... అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడ్డా... వారిలోప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఇలా అందరిప్రాణాలూ కాపాడటం కోసం ఉద్దేశించిన అంత్యంత కీలకమైనదే ఈ క్రిటికల్ కేర్ విభాగం. -
శశిథరూర్ ‘చిలక పలుకుల’పై కాంగ్రెస్ సెటైర్లు
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై.. ఆ పార్టీ తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్ పేరు ప్రస్తావించడకుండా సెటైర్లు వేశారు. ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఎంపీ శశిథరూర్ గెస్ట్‌కాలమ్ రాశారు. అందులో ఇందిరా గాంధీ పాలనలో జరిగిన బలవంతపు స్టెరిలైజేషన్, స్లమ్ తొలగింపు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ ‘పక్షి చిలుకైందే’ అంటూ శశి థరూర్ బీజేపీ లైన్‌ను అనుసరిస్తున్నారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.When a Colleague starts repeating BJP lines word for word, you begin to wonder — is the Bird becoming a parrot? 🦜Mimicry is cute in birds, not in politics.— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 10, 2025 ‘పక్షి చిలుకైందే’ అంటే స్వేచ్ఛగా ఎగిరే పక్షి.. ఇతరుల మాటలు యథాతథంగా పలికే చిలుకలా మారింది. పక్షులు ..చిలుకల్ని అనుకరిస్తే అందంగా ఉండొచ్చేమో.. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా పేర్కొన్న శశిథరూర్ నాటి దుర్భుర పరిస్థితుల్ని గెస్టు కాలంలో ప్రస్తావించారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బలవంతపు వాసెక్టమీ కార్యక్రమాలు నిర్వహించారు.పేదలు నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారిపై దాడులు చేయడం, న్యూఢిల్లీలాంటి నగరాల్లో మురికి వాడల్లో నివాసాల్ని కూల్చివేయడం, అక్కడ నివసించే వారిని ఖాళీ చేయించారు. ఫలితంగా వేలాది మంది నిట్ట నిలువ నీడలేక నిరాశ్రయులయ్యారు. వారి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని గుర్తు చేశారు. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 2025ఇలా ఇప్పుడే గతంలో కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తూ శశిథరూర్ పలు కామెంట్లు చేశారు. రెక్కలు నీవీ.. ఎగిరేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. ఆకాశం ఏ ఒక్కరిది కాదని ట్వీట్ చేశారు.అందుకు మాణిక్యం ఠాకూర్ మరో ట్వీట్లో ఎగిరేందుకు అనుమతి అడగొద్దు.‘పక్షులు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదు.. కానీ ఈ రోజుల్లో, స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. గద్దలు, రాబందులు, ఈగల్స్ ఎప్పుడూ వేటలో ఉంటాయి. స్వేచ్ఛ ఉచితం కాదు. ముఖ్యంగా వేటగాళ్లు దేశభక్తిని రెక్కలుగా ధరించినప్పుడు’బదులిచ్చారు. Don’t ask permission to fly. Birds don’t need clearance to rise…But in today even a free bird must watch the skies—hawks, vultures, and ‘eagles’ are always hunting.Freedom isn’t free, especially when the predators wear patriotism as feathers. 🦅🕊️ #DemocracyInDanger… pic.twitter.com/k4bNe8kwhR— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 26, 2025 -
ఆ తీర్పు న్యాయ చరిత్రలోనే మాయనిమచ్చ
న్యూఢిల్లీ: యాభై ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నకాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన తీర్పు ప్రపంచ న్యాయచరిత్రలోనే మాయనిమచ్చ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అభివర్ణించారు. దేశంలో అత్యయిక స్థితి విధించి ఈనెల 25వ తేదీతో 50 ఏళ్లుపూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరుపునున్న నేపథ్యంలో ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. ఎమర్జెన్సీకాలంలో ప్రాథమిక హక్కులు ఉండవంటూ ఆనాడు తీరి్పచ్చిన సుప్రీంకోర్టును ధన్‌ఖడ్ తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులనుద్దేశించి ధన్‌ఖడ్ ప్రసంగించారు. ఈ వివరాలను ఉపరాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘మంత్రిమండలి అభిప్రాయాలకు వీసమెత్తయినా విలువ ఇవ్వకుండా నాటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి ఫక్రుదీద్‌న్ అలీ అహ్మద్ ఆమోదముద్ర వేశారు. కేవలం ప్రధాని హోదాలో ఉన్న ఒక్కరి సలహాకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు. రాజ్యాంగంలో దీనిపై ఎన్నెన్నో నిబంధనలున్నాయి. ప్రధాని సారథ్యంలోని మంత్రులు రాష్ట్రపతికి సలహాలు, సూచనలు చేయొచ్చు. కానీ ఇవేం పట్టించుకోకుండా ఇందిరా గాంధీ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని విపరిణామాలను వెంటనే దేశం చవిచూసింది. ఆనాడు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షకుపైగా పౌరులను ప్రభుత్వం కటకటాల వెనక్కు నెట్టింది’’అని ధన్‌ఖడ్ గుర్తుచేశారు.న్యాయస్థానం పాత్ర దారుణం ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు అమలుకాకుండా ప్ర భుత్వం అడ్డుకుంది. అలాంటప్పుడు జ నం న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తారు. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా తొమ్మిది హైకోర్టులు ఎమర్జెన్సీ విధించినా, విధించకపోయినా ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయని చరిత్రాత్మక తీ ర్పులు ఇచ్చాయి. కానీ ఆ తీర్పులను కొట్టే స్తూ సుప్రీంకోర్టు అత్యంత ప్రజాస్వామికవ్యతిరేక తీర్పును వెలువర్చింది. ఇది నిజ ంగా ప్రపంచం న్యాయచరిత్రలోనే చీకటిపేజీ. ఎమర్జెన్సీ అమల్లో ఉంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండబోమని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో నియంతృత్వం, అధికారవాదం దేశంలో తిష్టవేశాయి. కోర్టుల్లో న్యాయం దక్కుతుందని భావిస్తున్న ప్రపంచం ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైంది. ఎంతకాలం ఎమర్జెన్సీ కొనసాగాలో అంతకాలం అది అమల్లోఉండేలా పాలకులు ఆశించిందే చివరకు జరిగింది’’అని ధన్‌ఖడ్ అన్నారు. ఈ పరిణామాల దృష్ట్యానే నేటి ప్రభుత్వం జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరపాలని సముచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీదాకా ఎమర్జెన్సీ అమల్లో ఉంది. -
దక్షిణ కొరియాలో పొలిటికల్ ట్విస్ట్.. కీలక మంత్రి రాజీనామా
సియోల్: దక్షిణ కొరియా రాజకీయంలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్న ప్రకటించి.. అనంతరం విరమించుకోవడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇక, దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ తాజాగా రాజీనామా చేశారు. అనంతరం, అధ్యక్షుడు.. కిమ్ రాజీనామాను ఆమోదించారు. వెంటనే.. సౌదీ అరేబియాలోని రాయబారి చోయ్ బ్యూంగ్-హ్యూక్‌ను కొత్త మంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగానే ఆయన రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది గట్టెక్కాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దక్షిణకొరియా పార్లమెంట్లో 300 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ తీర్మానాన్ని శుక్రవారం లోపు ఓటింగ్‌కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ పేర్కొన్నారు. -
‘ఎమర్జెన్సీ’ నిర్ణయాలన్నీ... చెల్లవని చెప్పలేం
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత మాత్రాన ఆ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లబోవని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ పదాలను జోడిస్తూ ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆ పదాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు న్యాయ సమీక్ష జరిపిందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ ధర్మాసనం గుర్తు చేసింది. తామిప్పుడు ఆ నిర్ణయంలో తాలూకు మంచిచెడుల్లోకి వెళ్లదలచు కోలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణను ముగించింది. నవంబర్ 25న తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 1976లో ఎమర్జెన్సీ అమల్లో ఉండగా నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సార్వభౌత, ప్రజాస్వామిక గణతంత్రం’ అన్నచోట ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం’ అని చేర్చారు. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. 42వ రాజ్యాంగ సవరణ ఇప్పటికే ఎన్నోసార్లు సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు గురైందని, పార్లమెంటు కూడా దీనిపై జోక్యం చేసుకుందని సీజేఐ గుర్తు చేశారు. మన దేశంలో సామ్యవాద అనే పదానికి సంక్షేమ రాజ్యమనే అర్థమే వాడుకలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయంలో ఇతర దేశాలకు, మనకు చాలా తేడా ఉంది. ప్రైవేట్ రంగ వికాసాన్ని మనమెప్పుడూ నిరోధించలేదు. మనమంతా ఆ రంగ వృద్ధి వల్ల లాభపడ్డవాళ్లమే’’ అని చెప్పుకొచ్చారు. లౌకికవాదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సామ్యవాదం, లౌకికవాదం పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మరో అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం ప్రవేశికకూ వర్తిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్.. కేంద్రం సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏడాది జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్(రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఎక్స్ ద్వారా ప్రకటన చేశారు.1975లో ఆ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఆ రోజులకు నిరసనగా ఇక నుంచి సంవిధాన్ హత్యా దివస్ నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నిర్ణయించింది. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజల్ని వేధించినందుకు ఈ పేరుతో దినోత్సవం జరుపుతామని అమిత్ షా తెలిపారు. ఎమర్జెన్సీలో కష్టాల పాలైన వారిని స్మరించుకునే విధంగా సంవిధాన్ హత్య దివస్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.25 जून 1975 को तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी ने अपनी तानाशाही मानसिकता को दर्शाते हुए देश में आपातकाल लगाकर भारतीय लोकतंत्र की आत्मा का गला घोंट दिया था। लाखों लोगों को अकारण जेल में डाल दिया गया और मीडिया की आवाज को दबा दिया गया। भारत सरकार ने हर साल 25 जून को 'संविधान… pic.twitter.com/KQ9wpIfUTg— Amit Shah (@AmitShah) July 12, 2024‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను ‘సంవిధాన్ హత్య దివస్’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం’’ అని ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన. సంవిధాన్ హత్యా దివస్‌పై మోదీ స్పందనఎమర్జెన్సీ నిరసన దినోత్సవ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తుచేస్తుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు అది’’ అని ప్రధాని పేర్కొన్నారు. 25 जून को #SamvidhaanHatyaDiwas देशवासियों को याद दिलाएगा कि संविधान के कुचले जाने के बाद देश को कैसे-कैसे हालात से गुजरना पड़ा था। यह दिन उन सभी लोगों को नमन करने का भी है, जिन्होंने आपातकाल की घोर पीड़ा झेली। देश कांग्रेस के इस दमनकारी कदम को भारतीय इतिहास के काले अध्याय के रूप… https://t.co/mzQFdQOxZW— Narendra Modi (@narendramodi) July 12, 2024విమర్శలకు తావిచ్చిన చీకటి రోజులు రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ నిర్ణయం తీసుకున్నారు. అది సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే. పత్రికాస్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ.. ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి, 21న ఎమర్జెన్సీని ఎత్తివేశారు. -
ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కావచ్చు, కానీ: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించి జూన్ 26కు 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఈ అంశం తాజాగా లోక్‌సభ సమావేశాలను కుదిపేస్తోంది. ముందుగా దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం, స్పీకర్ ఓం బిర్లా దీనిపై తీర్మానం చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ నాటి అత్యయిక స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కావచ్చు. కానీ, రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు.ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెంగోల్‌ను భర్తీ చేయడం, నీట్ పేపర్ లీక్‌లు వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే ఎమర్జెన్సీపై మోదీ, రాష్ట్రపతి, స్పీకర్ చేసిన వ్యాఖ్యలను థరూర్ తప్పుబట్టారు. 49 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనను ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చి, చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ‘ఎమర్జెన్సీని నేను విమర్శిస్తా. ఆ చర్యను నేను సమర్థించడం లేదు. గర్వించదగ్గ విషయమనీ చెప్పట్లేదు. అత్యయిక స్థితి సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమనే భావిస్తున్నా. అయితే, అది వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు. దేశంలో అంతర్గత ఎమర్జెన్సీని విధించేందుకు రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ పరిధిలోనే ఉంది. రాజ్యాంగ విరుద్ధమైన దాడి, రాజ్యాంగంపై దాడి అని రాష్ట్రపతి అనడం చట్టపరంగా సరికాదు' అని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం 1975 లేదా 2047 గురించి మాట్లాడుతోంది కానీ.. వర్తమాన అంశాలను ప్రస్తావించట్లేదని మండిపడ్డారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ సర్కారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్ వివాదం, నిరుద్యోగం సమస్యలు, మణిపుర్ అల్లర్ల వంటి కీలక అంశాలపై వారు దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలుపొందారు. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్‌గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్‌సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్‌సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్‌గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌కు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదు: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నేటితో (జూన్ 25) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలుగా మార్చిందని మండిపడ్డారు.ఈ మేరకు రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మోదీ గట్టిగా బదులిచ్చారు. అత్యవసర స్థితిని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే హక్కు హస్తం పార్టీకి లేదని విమర్శలు గుప్పించారు.ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రాథమిక స్వేచ్ఛను ఎలా కాంగ్రెస్ తుంగలో తొక్కిందని అన్నారు. ఎమర్జెన్సీ ప్రజలకు ‘చీకటి రోజులు’గా మారిందని విమర్శించారు.Today is a day to pay homage to all those great men and women who resisted the Emergency.The #DarkDaysOfEmergency remind us of how the Congress Party subverted basic freedoms and trampled over the Constitution of India which every Indian respects greatly.— Narendra Modi (@narendramodi) June 25, 2024 ‘ఎమర్జెన్సీని ప్రతిఘటించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, ప్రతి భారతీయుడూ గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తుంగలో తొక్కింది. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైలుపాలు చేసింది. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని హింసించారు, వేధించారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు.Just to cling on to power, the then Congress Government disregarded every democratic principle and made the nation into a jail. Any person who disagreed with the Congress was tortured and harassed. Socially regressive policies were unleashed to target the weakest sections.— Narendra Modi (@narendramodi) June 25, 2024 ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే నైతిక హక్కు లేదు. ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356ను విధించింది. పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే ఎన్నో బిల్లులను తెచ్చారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేశారు. రాజ్యాంగంలోని ప్రతిఅంశాన్ని ఉల్లంఘించారు. The mindset which led to the imposition of the Emergency is very much alive among the same Party which imposed it. They hide their disdain for the Constitution through their tokenism but the people of India have seen through their antics and that is why they have rejected them…— Narendra Modi (@narendramodi) June 25, 2024 కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉంది. రాజ్యాంగంపై వారికి ఉన్న అయిష్టాన్ని దాచిపెట్టి ఇప్పుడు నటిస్తున్నారు. అయితే, వారి ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే పదేపదే కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు’ అని మోదీ పేర్కొన్నారు.Those who imposed the Emergency have no right to profess their love for our Constitution. These are the same people who have imposed Article 356 on innumerable occasions, got a Bill to destroy press freedom, destroyed federalism and violated every aspect of the Constitution.— Narendra Modi (@narendramodi) June 25, 2024 కాగా జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ సమయంలో పౌర హక్కులను హరించివేశారు. ప్రతిపక్ష నాయకులు, అసమ్మతివాదులు, అనేకమంది ప్రజలు జైలు పాలయ్యారు. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు పెట్టారు. ఇది 1977 వరకు 21 నెలల పాటు అమలులో ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటిగా ఉండిపోయింది. -
ఎమర్జెన్సీ.. ఒక చీకటి యుగం
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.1975 జూన్ 25న అప్పట్లో దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రజాస్వామ్యవా దుల్ని అత్యంత క్రూరంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాల వల్ల దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రమాదంలో పడతాయని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘మన దేశంలో రాజ్యాంగమే అత్యుత్తమం. ప్రజాస్వామ్య విలువలున్న ఈ దేశంలో జూన్ 25ని ఎప్పటికీ మర్చిపోలేము. అది దేశ చరిత్రలో ఒక చీకటి యుగం’’ అని ప్రధాని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమర్జెన్సీపై రాసిన టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం గురించి తెలుసుకున్నానని తెలిపారు. అందులో ఎన్నో కేస్ స్టడీల్లో ఇందిర ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించిందో తెలుస్తుందన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరగాల్సిన మన్‌కీ బాత్ ప్రధాని అమెరికా పర్యటనతో ముందే ప్రసారమైంది. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రతీ ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ రోజూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం రోజు యూఎన్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చిందని ప్రధాని చెప్పారు. తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి మనం చేరుకున్నామని ప్రధాని చెప్పారు. గుజరాత్లో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం నుంచి కచ్ ప్రజలు వేగంగా కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
కోవోవ్యాక్స్, మొల్న్యుపిరావర్ అత్యవసర వాడుకకు సిఫార్సు
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టే ప్రక్రియలో సీరమ్ సంస్థ తయారీ కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించవచ్చని సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా కరోనా చికిత్సలో మొల్న్యుపిరావర్ మాత్రల ఉత్పత్తి, అత్యవసర వినియోగ అనుమతికి కూడా పచ్చజెండా ఊపింది. కోవోవ్యాక్స్పై నిపుణుల కమిటీ రెండుమార్లు పరిశీలన జరిపి చివరకు కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వాడేందుకు అనుమతించవచ్చని సిఫార్సు చేసింది. ఇప్పటికే ఈ టీకా ఎమర్జన్సీ వాడుకకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. కరోనా సోకిన వయోజనుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, రిస్కు పెరిగిన సందర్భాల్లో మొల్న్యుపిరావర్ను వినియోగించవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. ఈ ఔషధాన్ని డా. రెడ్డీస్ సహా పలు కంపెనీ కన్సార్టియం ఉత్పత్తి చేస్తోంది. ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులు దీన్ని వాడకూడదని, గర్భిణీలకు ఇవ్వకూడదని కమిటీ సిఫార్సు చేసింది. -
కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ ఓకే
న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న కోవోవాక్స్ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ నుంచి సీరమ్ లైసెన్సులు పొంది దీన్ని రూపొందిస్తోంది. సంస్థ నిర్ణయం కరోనాపై పోరులో మరో మైలురాయిగా సీరమ్ సీఈఓ అధార్ పూనావాలా అభివర్ణించారు. వచ్చే ఆరు నెలల్లో దీనిని విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల అధార్ చెప్పారు. ప్రస్తుతం ఇది ట్రయిల్స్ దశలో ఉంది. ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. కొత్త టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసినట్లు సీరమ్ గత నెలలో వెల్లడించింది. నోవావాక్స్ రూపొందించిన NVX& CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు పేర్కొంది. ఈ టీకా 90శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు భిన్న సాంకేతికతతో నోవావాక్స్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. డీజీసీఐ తనిఖీల ఫలితాల ఆధారంగా నోవోవాక్స్ వాడేందుకు అత్యవసర అనుమతినిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే భారత్‌లో దీని అత్యవసర వినియోగానికి డీజీసీఐ నుంచి అనుమతులురావాల్సిఉంది. ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారికే భారత్‌లో కరోనా టీకాలు ఇస్తున్నారు . -
‘అన్న అంత్యక్రియల కోసం వచ్చిన నన్ను చూసి అందరు ఏడ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి సమయంలో జైలు నుంచి వచ్చి అన్న అంత్యక్రియల్లో పాల్గొన్న తనను చూసి అందరూ చలించిపోయారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. 1975 జూన్ 25న అమలులోకి వచ్చిన ఆత్యయిక స్థితి నాటి రోజులు, పడిన కష్టాలు దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. ఆత్యయిక స్థితి అమలులోకి వచ్చిన రోజును ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన రోజుగా ఆయన అభివర్ణించారు. మన దత్తన్నే.. మారు వేషంలో ‘‘ఆ సమయంలో ఆర్ఎస్ఎస్లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేస్తున్నా. ఆర్ఎస్ఎస్ను నిషేధించడంతో పలువురితో కలసి రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. మారువేషాల్లో జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలోని సంఘర్షణ సమితికి పనిచేసే వాళ్లం. తొమ్మిది నెలల తర్వాత నేటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు మీసా చట్టం కింద అరెస్టు చేశారు. జైలులో ఉన్న సమయంలోనే అన్న అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియల కోసం పెరోల్‌పై బయటకు వచ్చాను. పోలీసుల రక్షణ వలయంలో వ్యాన్ నుంచి దిగిన నన్ను చూసి బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు’’ అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. చదవండి: మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్ -
ఈఎస్ఐ సభ్యులు నేరుగా ప్రైవేట్ ఆసుపత్రికెళ్లొచ్చు
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) సభ్యులు ఇకపై అత్యవసర పరిస్థితుల్లో తమ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి నేరుగా ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఈ వెసులుబాటును సంస్థ యాజమాన్యం కల్పించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం.. ఈఎస్ఐసీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు(లబ్ధిదారులు) తొలుత ఈఎస్ఐసీ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది. అక్కడి వైద్యుల సిఫార్సు మేరకు ప్రైవ్రేట్ హాస్పిటళ్లలో చేరొచ్చు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో ఈఎస్ఐసీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండానే నేరుగా ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి, సేవలు పొందవచ్చని టీయూసీసీ జనరల్ సెక్రెటరీ ఎస్.పి.తివారీ చెప్పారు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని వల్ల ఎంతోమంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అన్నారు. గుండె పోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంటుందన్నారు. -
కరోనా వ్యాక్సిన్‌పై చైనా కీలక నిర్ణయం
బీజింగ్ : సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కరోనావాక్‌కు జులైలోనే చైనా అత్యవసర వాడకానికి అనుమతించింది. వైద్య సిబ్బంది వంటి హైరిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనావ్యాక్సిన్ అత్యవసర వాడకానికి తమకు కూడా అనుమతి లభించిందని చైనా జాతీయ ఫార్మస్యూటికల్ గ్రూప్‌నకు చెందిన చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ) కూడా సోషల్ మీడియా వేదిక విచాట్‌లో పేర్కొంది. సీఎన్‌బీజీ అభివృద్ధి చేస్తున్న రెండు కరోనా వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షల్లో ఉండగా ఏ వ్యాక్సిన్‌కు అత్యవసర వాడకానికి చైనా అనుమతించిందనేది ఆ సంస్థ వెల్లడించలేదు. ప్రయోగ దశలో ఉన్న వివిధ కరోనా వ్యాక్సిన్లను జులై నుంచే అధిక ముప్పున్న వ్యక్తులకు ఇచ్చేందుకు చైనా అనుమతించింది. వర్షాకాలంలో వ్యాధి తీవ్రతను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ అత్యవసర వాడకాన్ని స్వల్పంగా విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేయాలని ఆరోగ్య శాఖ అధికారి ఓ వార్తఛానెల్తో మాట్లాడుతూ అన్నారు. అయితే హైరిస్క్ ప్రజలకు ఏయే కరోనా వ్యాక్సిన్లను అత్యవసర వాడకానికి అనుమతించారు, ఎంతమందికి వ్యాక్సినేషన్ జరిగిందనే వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు.జులైలో ఎమర్జెన్సీ యూజ్ కార్యక్రమం ప్రారంభయ్యే ముందు చైనా మీడియా కొన్ని వివరాలు వెల్లడించింది. విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎన్‌బీజీ అభివృద్ధి చేస్తున్న రెండు కరోనా వ్యాక్సిన్లలో ఒక వ్యాక్సిన్‌ను వేస్తారని చైనా మీడియా అప్పట్లో తెలిపింది. మరోవైపు కాన్సినో బయలాజిక్స్ వ్యాక్సిన్ వాడకాన్ని చైనా సైన్యం ఆమోదించింది. కరోనా వైరస్ నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా ఏడు వ్యాక్సిన్లు తుది దశ పరీక్షల్లో ఉండగా వాటిలో చైనా వ్యాక్సిన్లు నాలుగు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి పూర్తి భద్రత, సామర్ధ్యాన్ని కల్పించే దిశగా ఏ ఒక్క వ్యాక్సిన్ తుది దశ పరీక్షలను ఇప్పటివరకూ విజయవంతంగా పూర్తిచేయలేదు. కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది మరణించారు. చదవండి : వీచాట్ బ్యాన్ : డ్రాగన్ టిట్ ఫర్ టాట్ వార్నింగ్ -
‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్నేహితుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, ఫెర్నాండెజ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఫెర్నాండెజ్‌ను చూస్తే.. ఇందిరా గాంధీ విపరీతంగా భయపడేవారన్నారు సుబ్రమణ్య స్వామి. ఆయన మాట్లాడుతూ.. ‘గాంధీ కుంటుంబం అంటే ఫెర్నాండెజ్‌కు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ కుటుంబం దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్మేవాడు. ఆయన తన జీవితాంతం కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించాడు’ అని తెలిపారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఫెర్నాండెజ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడన్నారు. ‘ఆ సమయంలో ఫెర్నాండెజ్‌ను చూస్తే ఇందిరా గాంధీ భయపడేవారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాతే ఇందిరా గాంధీ ప్రశాంతంగా ఉండగలిగార’ని తెలిపాడు సుబ్రమణ్య స్వామి. అంతేకాక తమ అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఫెర్నాండెజ్ నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. మేం తరచుగా కలుసుకుని పలు అంశాల గురించి చర్చించేవాళ్లం. అతను చాలా తెలివైన వాడు. అతడు తన జీవితంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో గొప్ప ర్యాలీలు, సభలు నిర్వహించాడ’ని తెలిపారు. అంతేకాక ఫెర్నాండెజ్ బోఫోర్స్ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనిభావించారు. కానీ వాజ్‌పేయ్ సూచన మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారన్నారు సుబ్రమణ్య స్వామి. అంతేకాక సైనికులు క్షేమం గురించి ఫెర్నాండెజ్ కన్నా ఎక్కువగా ఏ రక్షణశాఖ మంత్రి కృషి చేయలేదని ప్రశంసించారు. -
ఇక ట్రాకింగ్, ఎమర్జెన్సీ బటన్లు తప్పనిసరి
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి రిజిస్టర్ అయ్యే అన్ని కొత్త ప్రజా రవాణా వాహనాల్లోనూ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు, ఎమర్జెన్సీ బటన్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆటోలు, ఈ–రిక్షాలకు నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నామనీ, ఇవి కాకుండా మిగిలిన ప్రజా రవాణా వాహనాలన్నింటికీ 2019 జనవరి 1 నుంచే కొత్త నిబంధన అమలవుతుందని వెల్లడించింది. క్యాబ్‌ల వంటి వాహనాల్లో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, ప్రయాణికులు అధికారులకు తెలియజేసేందుకు ఎమర్జెన్సీ బటన్ ఉపయోగపడుతుంది. ఆ వాహనం ఎక్కడుందో గుర్తించేందుకు లొకేషన్ ట్రాకింగ్ పరికరం దోహదపడుతుంది. -
మాతా శిశు కేంద్రంలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్
కరీంనగర్‌హెల్త్: పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బాలింతలు, గర్భిణులకు అత్యసవర సమయంలో రక్తం అందుబాటులో ఉంచాలని బ్లడ్ స్టోరేజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఈ స్టోరేజీ సెంటర్‌ను వారం క్రితమే ఇక్కడికి తరలించారు. కొత్తగా ఆధునిక హంగులతో బ్లడ్‌స్టోరేజ్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం ఇక్కడికి తరలించింది. రోగుల సంఖ్యకు తగినట్లుగా వైద్యం.. మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాన్పుల కోసం వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించాలని కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఈ పథకంతో ఆస్పత్రిలో ప్రసవాలు పెరిగాయి. ప్రసుతం నెలలో వెయ్యి ప్రసవాల వరకు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంసీహెచ్‌సీలో మెరుగైన వైద్యం అందిస్తుండటంతో మాతాశిశు మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరణాలు తగ్గడం, మెరుగైన సేవలతో ప్రసవాల సంఖ్య రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచి ఉత్తమ వైద్య సేవలకు జిల్లాకు అవార్డు వచ్చింది. ఇదేవిధంగా మరింత వైద్య సేవలతో ప్రజలకు మేలు జరుగాలనే ఉద్దేశంతో బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల నుంచి తరలింపు.. రాజన్నసిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. కొత్తగా జిల్లా కావడంతో అక్కడ బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి అధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి కరీంనగర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సెంటర్ నిర్వహణకు ఉపయోగించే మిషనరీతోపాటు అక్కడ పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లను కూడా డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. బ్లడ్‌స్టోరేజ్ లైసెన్స్ కోసం.. మాతాశిశు ఆరోగ్యం కేంద్రంలో వెంటనే బ్లడ్‌స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు గదిని కేటాయించారు. ఈ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ మంజూరు కావాల్సి ఉంది. లైసెన్స్ కోరుతూ సంబంధి శాఖకు దరఖాస్తు చేసుకోగా ఇటీవల ఐదుగురు సభ్యులు గల బృందం మాతాశిశు కేంద్రాన్ని పరిశీలించింది. బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌కు మిషనరీతోపాటు సిబ్బంది, రిఫ్రిజిరేటర్ సౌకర్యం, గది వైశాల్యం నిబంధనల ప్రకారం ఉండాల్సి ఉంది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే అన్ని రకాల బ్లడ్ 3 నుంచి 4 యూనిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. లైసెన్స్ మంజూరు కాగానే బ్లడ్‌సోరేజీ సెంటర్ త్వరలోనే ప్రారంభం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని నియమించాలి.. జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌సీలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్ ఏర్పాటు చేయడంతోపాటు బ్లడ్‌బ్యాంక్ ను మరింత ఆధునికీకరించి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. కోట్లాది రూపాయలతో ఆస్పత్రుల్లో సౌకర్యాలు, మెషినరీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం కావాల్సిన సిబ్బందిని నియమించడంలో వెనకాడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆధునిక సౌకర్యాలతో సేవలం దించేందుకు బ్లడ్‌బ్యాంక్‌లో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అనిశ్చితి సృష్టించడమే వారి పని
మఘర్ (యూపీ): స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలన్నీ చేతులు కలిపి సమాజంలో అనిశ్చితి సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన వారు, అప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు కలిసి ఒకే కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మఘర్‌లో 15వ శతాబ్దం నాటి కవి, తత్వవేత్త కబీర్ దాస్ 500వ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ.. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో విపక్షాలపై నిప్పులుగక్కారు. ‘అధికారం కోసం ఎంతకైనా దిగజారేందుకు సిద్ధమయ్యారు. ఎమర్జెన్సీని విధించిన వారు, దీన్ని అప్పుడు వ్యతిరేకించినవారు.. నేడు కలసి నడుస్తున్నారు. ఇది కేవలం అధికారాన్ని దక్కించుకోవడానికే. వారికి దేశం, సమాజ సంక్షేమం గురించి పట్టింపు లేదు. కేవలం తమ కుటుంబ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని పనిచేశారు. తమ జేబులు నింపుకునేందుకు పేదలు, అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారు. కోట్ల విలువైన భవంతులు కట్టుకుంటున్నారు’ అని మోదీ విమర్శించారు. కుల, మతాలకు అతీతంగా సమాజంలో అందరూ ఉండాలంటూ తన కవితలతో ప్రచారం చేసిన కబీర్ దాస్ మఘర్లోనే తుదిశ్వాస విడిచారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయే. ఎస్పీ, బీఎస్పీలపై విమర్శలు ‘ఒకవేళ సమాజంలో అనిశ్చితి ఏర్పడితే.. అది తమకు రాజకీయంగా లాభిస్తుందనేది వారి ఆలోచన. కానీ వారు వాస్తవం నుంచి చాలా దూరంలో ఉన్నారు. సంత్ కబీర్, అంబేడ్కర్, మహాత్మాగాంధీ వంటి మహామహులు పుట్టిన ఈ దేశంలోని ప్రజల మనసుల్లో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నారు. సమాజ్‌వాద్, బహుజన్ అని చెప్పుకుంటున్న వారంతా పూర్తి స్వార్థపరులు’ అని పరోక్షంగా ఎస్పీ, బీఎస్పీలపై ప్రధాని విమర్శలు చేశారు. ‘కబీర్ దాస్తోపాటు, రాయ్దాస్, మహాత్మా పూలే, గాంధీ, అంబేడ్కర్ తదితరులు సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని చాలా కృషిచేశారు. దురదృష్టవశాత్తూ.. సమాజంలో విభజన తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకే.. కొందరు ఈ మహామహుల పేర్లను వాడుకుంటున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. మఘర్‌ను ప్రపంచ సామాజిక సామరస్య కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కబీర్ సమాధి వద్ద మోదీ చాదర్ సమర్శించారు. సంత్ కబీర్ అకాడెమీకి శంకుస్థాపన చేశారు. విలువైన నేత పీవీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 97వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశచరిత్రలో అత్యంత సంకట పరిస్థితుల్లో పీవీ చూపిన విలువైన నాయకత్వ పటిమ మరువలేమని ప్రశంసించారు. ‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విలువైన నాయకుడు. అద్భుతమైన రాజనీతిజ్ఞతతో దేశ చరిత్రలో క్లిష్టమైన సమయాల్లో తన గొప్ప నాయకత్వ లక్షణాలతో దేశాన్ని ముందుకు నడిపారు. అద్భుతమైన మేధస్సు ఆయన సొంతం’ అని ట్వీట్ చేశారు. -
అత్యవసర సాయం కోసం హెలిప్యాడ్లు
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో సాయం అందించేందుకు ముంబైతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హెలిప్యాడ్లు నిర్మించే ప్రతిపాదనల్లో కదలికవచ్చింది. హెలిప్యాడ్ల నిర్మాణం కోసం నగరాభివృద్ధిశాఖ రూపొందించిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతానికి అగ్నిమాపక శాఖకు చేరాయి. 2005 జూలై 26న నగరంలో కురిసిన భారీ వర్షానికి వరదలు వచ్చి ఆస్తి నష్టంతోపాటు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అత్యవసర సమయంలో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలలో సకాలంలో సాయం అందలేకపోయింది. ఇటువంటి పరిస్థితి మళ్లీ తలెత్తితే తీసుకోవల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలు సూచించేందుకు అప్పట్లో ప్రభుత్వం చితలే కమిటీని నియమించింది. ఈ కమిటి కొన్ని సూచనలు జారీచేసింది. ఆపద సమయాల్లో హెలిక్యాప్టర్ల ద్వారా సేవలు అందించే సదుపాయం ఉంటే ప్రాణనష్టం తప్పేదని కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హెలిప్యాడ్డు నిర్మించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అయితే ఎక్కడ? ఎంత ఎత్తులో నిర్మించాలనే ప్రతిపాదనలను నగరాభివృద్ధిశాఖ రూపొందించింది. వీటిని అగ్నిమాపక శాఖకు పంపగా హెలిప్యాడ్ల ఎత్తులో మార్పులు అవసరమని అగ్నిమాపక శాఖ సలహాదారు మిలింద్ దేశ్‌ముఖ్ చెప్పారు. అయితే తాము రూపొందించిన ప్రతిపాదనల్లో.. ముంబై తరహా ప్రధాన నగరాలలో 150-200 మీటర్లకుపైగా ఎత్తున్న భవనాలపై హెలిప్యాడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నగరాభివృద్ధిశాఖ భావించింది. దీనిపై అగ్నిమాపకశాఖ పక్షం రోజుల్లో తుది నిర్ణయం వెల్లడించనుంది.


