సైదాబాద్‌ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల | YS Sharmila Condolence To Saidabad Rape Victim Family | Sakshi
Sakshi News home page

సైదాబాద్‌ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల

Sep 15 2021 2:23 PM | Updated on Sep 15 2021 9:08 PM

YS Sharmila Condolence To Saidabad Rape Victim Family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్‌ చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధినేత్రి వైఎస్‌ షర్మిల పరామర్శించారు. బాధతురాలి ఇంటి వద్ద వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్‌ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. ఆమెతోపాటు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్‌ విజయమ్మ కూడా దీక్షలో కూర్చున్నారు.

బాధిత కుటుంబానికి రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ హయాంలో మహిళలపై లైంగికదాడులు అధికమైయ్యాయని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement