ప్రియుడి మృతిని తట్టుకోలేక.. ఉరేసుకొని ప్రియురాలు ఆత్మహత్య | Hyderabad: Girl Commits Suicide After Her Boyfriend Death - Sakshi
Sakshi News home page

ప్రియుడి మృతిని తట్టుకోలేక.. ఉరేసుకొని ప్రియురాలు ఆత్మహత్య

Oct 4 2023 7:34 AM | Updated on Oct 4 2023 11:46 AM

Young woman suicide at Hyderabad - Sakshi

ఇద్దరు ఒకే బేకరీలో పని చేసేవారు.. వీరి మధ్య ఏర్పపడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.

హైదరాబాద్: ఇద్దరు ఒకే బేకరీలో పని చేసేవారు.. వీరి మధ్య ఏర్పపడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి పెళ్లికి ప్రియుడి కుటుంబం నిరాకరించడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన ప్రేమికురాలు ఉరి వేసుకొని తనువు చాలించిన విషాద ఘటన గచి్చ»ౌలి పోలీస్‌ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జేమ్స్‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహ (19) ఎనిమిది నెలల క్రితం నగరానికి వచ్చి గౌలిదొడ్డిలోని జర్నలిస్ట్‌ కాలనీలో  వైష్ణవి పీజీ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది.

నానక్‌రాంగూడలోని గోల్ఫ్‌ ఎడ్జ్‌లోని ఓ బేకరీలో సేల్స్‌ గర్ల్‌గా చేరింది. బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలో వెంకటాపురంలో నివసించే సల్మాన్‌ ఆరు నెలల క్రితం సదరు బేకరీలో చేరాడు. వీరిరువురు మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో సల్మాన్‌ను బేకరీ నుంచి తొలగించారు. సల్మాన్‌ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సల్మాన్‌ ఈ నెల 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రియుడు చనిపోయిన విషయం తెలియడంతో నేహ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు రూమ్‌ మేట్స్‌ డ్యూటికీ వెళ్లగానే తలుపు గడియ పెట్టుకుంది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ నిర్వాహకులు వెంటనే గచి్చ»ౌలి పోలీసులకు సమాచారం అందించారు. ప్రియుడు సల్మాన్‌ ఆత్మహత్యను జీరి్ణంచుకోలేక తనువు చాలించిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement