Hyderabad- Sravani: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు | Young Woman Sravani missing in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad- Sravani: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు

Nov 15 2022 2:43 PM | Updated on Nov 15 2022 2:43 PM

Young Woman Sravani missing in Hyderabad - Sakshi

అదృశ్యమైన  యువతి శ్రావణి 

సాక్షి, హైదరాబాద్‌: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై జి.సురేష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక ప్రాంతానికి చెందిన రాజు కుమార్తె కె.శ్రావణి (18) ఈ నెల 12వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.

వివిధ ప్రాంతాల్లో, బంధు మిత్రుల ఇండ్లలో ఎంత వెదికినా ఆచూకి లభించలేదు. దీంతో తల్లి కృష్ణవేణి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.    

చదవండి: (Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్‌)

Advertisement
 
Advertisement
Advertisement