కొడుకు పుట్టనో.. చెట్టునో పట్టుకుని ఉంటడు | Young Man Go Missing in Godavari River | Sakshi
Sakshi News home page

కొడుకు పుట్టనో.. చెట్టునో పట్టుకుని ఉంటడు

Sep 7 2025 7:43 AM | Updated on Sep 7 2025 7:43 AM

Young Man Go Missing in Godavari River

జాడ కోసం గోదావరిలో గాలించండి 

రాజేశ్‌ యాదవ్‌ తల్లిదండ్రుల ఆవేదన 

వినాయక నిమజ్జన ప్రదేశంలో కన్నీటి పర్యంతం 

నదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

రామగుండం/యైటింక్లయిన్‌కాలనీ: ‘నా కొ డుకు చెట్టునో పుట్టనో పట్టుకొని ఉంటడు.. ఒక్కగానొక్క కొడుకు.. ఓ కన్ను పోయినా సాదుకుంటా.. ఓ కాలు తెగినా సాదుకుంటా దేవుడా.. ఎంతో అందంగా ఉన్న సక్కనోడు.. అమ్మా.. నాన్న ఒక్కడు పనిచేస్తే డబ్బులు సరిపోతలేవు.. దసరా పోయినంకా నేను కూడా పనికి పోతనే.. నీకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీవు పనిచేసే పరిస్థితి లేదు కదా.. నేను, నాన్న ఇద్దరం కలిసి పనికి పోతమే.. ఏడాదిలో రెండు గదులతో ఇల్లు కట్టుకుందామే.. అంటివి బిడ్డా.. మొన్ననే సెల్‌ఫోన్‌ కొనిత్తిని.. వినాయకుడా.. నాకు కడుపుకోత పెట్టకు.. గోదారమ్మ తల్లీ.. నా కొడుకును నువ్వు తీసుకుంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి నీ ఒడిలోకి చేరుతం’ అని ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. వివరాలు.. 

స్థానిక అక్బర్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న నారకట్ల మహేశ్వరి – సత్యం దంపతుల కుమారుడు రాజేశ్‌యా దవ్‌ ఉన్నాడు. అదేకాలనీలో గణపతి విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని గంగానగర్‌ సమీప గోదావరిలో నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులతో కలిసి వెళ్లాడు. శనివారం వేకువజామున విగ్రహం నిమజ్జనం కోసం క్రేన్‌ కొక్కేనికి తగిలించే క్రమంలో టేబుల్‌పైకి రాజేశ్‌యాదవ్‌ ఎక్కాడు. దానిపై అడ్డుగా ఉన్నతీగలు కాలికి తగలడంతో అదుపుతప్పి ప్రమాదవాశాత్తు గోదావరిలో పడిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనను నిరసిస్తూ అక్బర్‌నగర్‌ కాలనీవాసులు నది వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. 

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తియ్యిందనుకునే సమయంలోనే గో దావరిలో యువకుడు గల్లంతుకావడంతో విషా దం నెలకొంది. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ ఠాకూ ర్, బీఆర్‌ఎస్‌ కారి్మక సంఘం నేత కౌశిక హరి, కాంగ్రెస్‌ నేత అయోధ్యసింగ్‌ఠాకూర్, ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాదరావు, ఇంద్రసేనారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంతెన పిల్లర్ల నుంచి సుందిళ్ల బ్యారేజీ వరకు రెండు స్పీడ్‌ బోట్లు, నాలుగు నాటు పడవలు, ఇరవై మందితో గా లింపు చర్యలు చేపట్టామని ఏసీపీ రమేశ్‌ తెలి పారు. కాగా, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మా ట్లాడుతూ, రాజేశ్‌యాదవ్‌ కుటుంబానికి రూ. 2లక్షల నగదు పరిహారంగా అందిస్తామని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఊహించని పరిణామమని  బీఆర్‌ఎస్‌ కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement