దర్శనానికి మూడు గంటల సమయం  | Yadadri Temple: Huge Devotees Crowd In Yadadri | Sakshi
Sakshi News home page

దర్శనానికి మూడు గంటల సమయం 

May 23 2022 1:44 AM | Updated on May 23 2022 9:56 AM

Yadadri Temple: Huge Devotees Crowd In Yadadri - Sakshi

స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు 

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.

సుమారు 30 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ పూజల ద్వారా రూ.33,81,486 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement