Case Filed On MLA Komatireddy Rajagopal: Check Details - Sakshi
Sakshi News home page

చల్లారని ‘చౌటుప్పల్‌ పంచాయితీ’: ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కేసు నమోదు

Jul 27 2021 6:44 PM | Updated on Jul 27 2021 8:50 PM

Yadadri: Case Filed Against MLA Komatireddy Rajagopal Reddy - Sakshi

మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోని మైకును లాక్కుంటున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, యాదాద్రి భువనగిరి:  మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రసంగం అడ్డుకుని రభస చేశారని ఎమ్మార్వో ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో  రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకి సమాచారం ఇవ్వకుండానే అధికారిక కార్యక్రమాన్నిమంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించడం ఏమిటని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ 

Advertisement
 
Advertisement
Advertisement