మాదాపూర్‌: చికెన్‌ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్‌ | Worms In Chicken Fry At Madhapur Restaurant | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌: చికెన్‌ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్‌

Nov 3 2024 4:08 PM | Updated on Nov 3 2024 4:18 PM

Worms In Chicken Fry At Madhapur Restaurant

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.

మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో చికెన్‌ ఫ్రైలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. సైబర్‌ టవర్‌ ఎదురుగా ఉన్న హోటల్‌ నుంచి ఓ కస్టమర్‌ ఆర్డర్‌ తెప్పించుకున్నారు. పార్శిల్‌ ఓపెన్‌ చేయగానే పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో షాక్‌ తిన్న  కస్టమర్‌ అనిరుధ్‌ జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement