మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం | Sakshi
Sakshi News home page

మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం

Published Mon, Jan 1 2024 8:42 AM

woman missing in hyderabad - Sakshi

హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్‌ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్‌తో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. 

ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్‌వాక్‌కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్‌ అత్తగారికి ఫోన్‌ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది.  ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్‌ ఆదివారం మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement