
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మియాపూర్: ఓ యువతికి మూర్ఛరావడంతో సంపులో పడి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ గిరీష్ తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా గాం«దీనగర్‌లోని బాచనాయక్‌తండాకు చెందిన లునావత్ నిర్మల(26) మియాపూర్‌లోని మయూరినగర్ స్వదర్ గృహ అనాథాశ్రమంలో ఉంటుంది. నిర్మల మూర్చవ్యాధితో బాధపడుతుండేది. సోమవారం ఉదయం బ్రష్ చేసుకుంటూ ఉండగా మూర్ఛ రావడంతో అనాథాశ్రమ ప్రాంగణంలో ఉన్న సంపులో పడిపోయింది.
ఎవరూ చూడకపోవడంతో అందులో మునిగి మృతిచెందింది. కొద్దిసేపటి తర్వాత నిర్మల అశ్రమంలో కనిపించకపోవడంతో నిర్వాహకులు వెతకగా సంపులో కనిపించింది. బయటకు తీయగా అప్పటికే మృతిచెంది ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని గాందీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.