Villagers Protested In Basara Complains Against Renjarla Rajesh, Details Inside - Sakshi
Sakshi News home page

సరస్వతి అమ్మవారిపై రేంజర్ల రాజేశ్‌ అనుచిత వ్యాఖ్యలు.. బాసర బంద్‌

Jan 3 2023 10:29 AM | Updated on Jan 3 2023 2:43 PM

Villagers Protested In Basara Complains Against Renjarla Rajesh - Sakshi

బాసరలో గ్రామస్తుల ఆందోళన

సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సాక్షి, నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా బాసరలో గ్రామస్థుల బంద్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్‌ మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా  గ్రామస్థులు రేంజర్ల రాజేశ్‌  దిష్టిబోమ్మను  దగ్దం చేశారు‌.‌

పోలీసులకు ఫిర్యాదు..
బంద్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే బాసర పోలీస్‌ స్టేషన్‌లో రేంజర్ల రాజేశ్‌పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చదవండి: బైరి నరేశ్‌ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..

Advertisement
 
Advertisement
Advertisement