వెయ్యి కోట్ల లక్ష్యం వైపు విజయ డెయిరీ: తలసాని 

Vijaya Dairy Aim Towards Rs 1000 Crore Target: Talasani Srinivas Yadav - Sakshi

మాదాపూర్‌ (హైదరాబాద్‌): మూతపడిపోతుందని ఊహాగానాలు వినిపించిన విజయ డెయిరీ రూ.650 కోట్ల టర్నోవర్‌ సాధించి రూ.1000 కోట్ల లక్ష్యం వైపు దూసుకుపోతోందని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మాదాపూర్‌ లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న డెయిరీ, ఫుడ్‌ ఎక్స్‌పోను హోంమంత్రి మహమూద్‌ అలీతో కలసి శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ నగరంలో పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. ఈ ఎక్స్‌పోను ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, మీడియా డే మార్కెటింగ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రదర్శనలో 100కు పైగా ఎగ్జిబిటర్లు, 120 బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను, సేవలను ప్రదర్శిస్తున్నాయన్నారు. మహమూద్‌ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్, నీరు రైతులకు సమృద్ధిగా లభిస్తున్నాయని చెప్పారు. నగరంలో పాల డిమాండ్‌లో 30 శాతం మాత్రమే తీర్చగలుగుతున్నామన్నారు. మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌లున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top