తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోంది: కిషన్‌ రెడ్డి | Sakshi
Sakshi News home page

కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది: కిషన్‌ రెడ్డి

Published Sat, Nov 12 2022 1:52 PM

Union Minister Kishan Reddy Criticizes TRS CM KCR In Begumpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా బేగంపేటలో నిర్వహించిన సభలో మాట్లాడారు.

‘తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు. ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్‌ది నిజాం రాజ్యాంగం. సీఎం కేసీఆర్‌ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు. తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది. రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంద’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు కిషన్‌ రెడ్డి.

ఇదీ చదవండి: తెలంగాణ రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన.. కీలక అప్‌డేట్స్‌

Advertisement
Advertisement