ఇద్దరు పిల్లలను నరికి చంపి.. తల్లి ఆత్మహత్య | Two Sons And Mother Lost Their Lives In Gajularamaram | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలను నరికి చంపి.. తల్లి ఆత్మహత్య

Apr 17 2025 5:50 PM | Updated on Apr 17 2025 5:52 PM

Two Sons And Mother Lost Their Lives In Gajularamaram

సాక్షి, మేడ్చల్‌: జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కొడుకులను వేట కొడవలితో నరికి చంపిన తల్లి.. ఆ తర్వాత తాను భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. గాజుల రామారంలో ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలో ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుభకార్యాలకు సంబంధించిన అలంకరణ సామగ్రి ఉన్న గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దాదాపు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement