రెండ్రోజులు తేలికపాటి వానలు! | Telangana IMD Weather Report: Light Rains Are Likely To Occur In Many Districts Of Telangana For 2 Days - Sakshi
Sakshi News home page

Telangana IMD Rainfall Report: రెండ్రోజులు తేలికపాటి వానలు!

Published Mon, Feb 26 2024 4:16 AM

Two Days Of Light Rain For Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా అదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫా­బాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.

పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. గతవారం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీ సెల్సియస్‌ మేర అధికంగా నమోదయ్యాయి. సీజన్‌లో నమోదు కావాల్సిన స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదై ముందస్తుగా వేసవి హెచ్చరిక మాదిరిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసా­రిగా వాతావరణం చట్టబడింది.

దీంతో పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణం కంటే కిందకు పడిపోయాయి. వేసవి సీజన్‌ చివరి దశలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడు­తున్నారు. రెండ్రోజులు ఇదే తరహా వాతావరణం ఉన్నప్పటికీ... తర్వాత పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతా­యని వాతా­వరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 15.2 డిగ్రీ సెల్సియస్‌ చొప్పున నమోదయ్యాయి.

Advertisement
Advertisement